హగ్ ఇస్తారా అంటూ హద్దుమీరుతున్న ప్రాంక్ వీడియోస్…ఇద్దరు యువతుల ఫిర్యాదుతో?

హగ్ ఇస్తారా అంటూ హద్దుమీరుతున్న ప్రాంక్ వీడియోస్…ఇద్దరు యువతుల ఫిర్యాదుతో?

by Anudeep

Ads

అమలాపాల్ ది ఆమె సినిమా గుర్తుందా.. ఆ సినిమాలో ప్రాంక్ వీడియోస్ చేస్తుంటుంది అమలా.. ఒకసారి తను చేసిన ప్రాంక్ వల్ల ఒకమ్మాయి ఇబ్బందులకు గురౌతుంది..దాంతో అమలాపాల్ కి బుద్ది చెప్పాలనుకుంటుంది..ఒంటిపై నూలు పోగు లేకుండా ఒక దగ్గర బంధిస్తుంది..ఇలా సాగుతుంది ఆ కథ.. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది..లిమిట్ దాటితే పర్యవసనాలు వేరేగా ఉంటాయి అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ.

Video Advertisement

ఒకప్పుడు మన దగ్గర ప్రాంక్ అంటే ఏంటో తెలీదు..కొత్తలో వింతగా బానే ఉండేది. కొన్ని ప్రాంక్స్ నవ్వుతెప్పించేవి కూడానూ . కాని రాను రాను దాన్ని మరీ చిల్లరగా వాడుతుంటే ఏహ్యభావం కలుగుతోంది . అలా పిచ్చి ప్రాంక్ చేసిన ఒకడికి ఇద్దరమ్మాయిలు బుద్ది చెప్పారు. ఒక హగ్ ఇస్తారా ప్లీజ్ అంటూ అమ్మాయిల్ని ఏడిపించి, చివరికి ప్రాంక్ అంటూ కెమెరా వైపు చూపించేవాడు.. కొందరమ్మాయిలు లైట్ తీసుకున్నప్పటికి ఇద్దరమ్మాయిలు పోలీసు కంప్లైంట్ ఇచ్చి మనోన్ని ఊచలు లెక్కపెట్టేలా చేశారు.

రమావత్ సురేశ్ అనే వ్యక్తి డ్రీమ్ బాయ్ జయసూర్య పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. ఆ యూట్యూబ్ ఛానెల్ లో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు సంబంధించిన లింక్స్, బెట్టింగ్స్‌కు అవసనరమైన లింక్స్ పెట్టి వాటిని యూజ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబర్స్ నుండి అమౌంట్ కలెక్ట్ చేసేవాడు. ఇలాంటి చట్టవ్యతిరేకమైన పనులతో పాటు ప్రాంక్లు వెలగబెట్టేవాడు. ఏడాది క్రితం ఒంటిపై టవల్ చుట్టుకుని పబ్లిక్ ప్లేసులో అమ్మాయిల ముందుకి వెళ్లి సినిమా చూస్తారా అంటూ టవల్ తీసి భయపెట్టేలా ఒక ప్రాంక్ చేశాడు.. లోపల షార్ట్ ఉండేది.. భయపడ్డ అమ్మాయిలకి ప్రాంక్ అంటూ కెమెరా చూపించేవాడు.

ఆ వీడియోపై ఎవరూ కంప్లైంట్ ఇవ్వకపోయినప్పటికి సైబర్ స్పేస్ పోలీసింగ్ ద్వారా ఈ వీడియోని గుర్తించిన పోలీసులు ఆ వీడియోను యూట్యూబ్ నుండి తొలగించారు. రమావత్ సురేష్ ని పిలిపంచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.  ఆ తర్వాత నేను సింగిల్ నాకొక హగ్ ఇవ్వండంటూ ఒక ప్రాంక్ చేసి యూట్యూబ్లో పెట్టాడు. ఆ ఫ్రాంక్ చేసింది. యూట్యూబ్లో అప్లోడ్ చేసింది గతేడాది సెప్టెంబర్లో..ఇప్పుడు ఆ వీడియో మీద ఇద్దరమ్మాయిలు కంప్లైంట్ చేశారు.

ఆ వీడియోని ఇప్పటివరకు పన్నెండు లక్షలమంది చూసారు. అందులో ప్రతి సీన్‌ తర్వాత ఇది ప్రాంక్‌ వీడియో అంటూ వారికి చెబుతూ..అదిగో అక్కడ కెమెరా ఉంది, హాయ్‌ చెప్పండి అంటూ చెప్పేవాడు.కాని ఇద్దరమ్మాయిల విషయంలో వారికి అలా చెప్పలేదు, ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టేశాడు. తమ అనుమతి లేకుండా వీడియోని యూట్యూబ్లో పెట్టడం పట్ల యువతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  సైబర్ క్రైంకి కంప్లైంట్ చేశారు.కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడే కాదు ఎవరైనా సరే హద్దు మీరితే కటకటాలు తప్పవు, కాబట్టి జాగ్రత్త..

source: sakshi news


End of Article

You may also like