డ్రోన్ల సహాయంతో అధికారులు చేసిన సహాయం చూస్తే శభాష్ అంటారు .

డ్రోన్ల సహాయంతో అధికారులు చేసిన సహాయం చూస్తే శభాష్ అంటారు .

by Anudeep

Ads

కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ భారీ వర్షాల వల్ల కొన్ని ప్రదేశాలలో వాగులు కట్టలు తెగి ఊర్లోకి వెళ్లేందుకు దారి లేకుండా పొంగి ప్రవహిస్తున్నాయి. ఎన్నో గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి కనీస అవసరాల కోసం కూడా బయట ప్రదేశాలకు వెళ్ళలేక ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కుర్తి గ్రామస్తులు చిక్కుకున్నారు.

Video Advertisement

గ్రామానికి చెందిన కన్నయ్య అనే 16 నెలల బాబు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ వుండగా గ్రామం నుంచి వైద్యశాలకు వెళ్లే దారి లేనందున గ్రామస్తులు అధికారులకు అర్జీ పెట్టుకొనగా వారి పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు గ్రామానికి వైద్య అధికారిని పంపించే అవకాశం లేకపోవడంతో ఆ బాలునికి మరియు గ్రామంలోని ఇతర గ్రామస్తులకు అవసరం అయ్యే అన్ని ఔషధాలను డ్రోన్స్ సహాయంతో సాంకేతికతను ఉపయోగించి గ్రామానికి పంపించారు. అధికారులు చేసిన ఈ పనికి గ్రామస్తులు అంతా ఎంతో హర్షం వ్యక్తం చేశారు చేయాలని చిత్తశుద్ధి ఉంటే అపాయానికి తగిన ఉపాయం ఉంటుందని, మానవులకు ప్రయోజనాలు అందించడంలో సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సంఘటనే రుజువు చేస్తోంది.

 


End of Article

You may also like