Ads
- చిత్రం : దృశ్యం 2
- నటీనటులు : వెంకటేష్, మీనా, కృతిక జయ కుమార్, ఎస్తేర్ అనిల్, నరేష్, నదియా.
- నిర్మాత : ఆంటోనీ పెరుంబవూర్, సురేష్ దగ్గుబాటి
- దర్శకత్వం : జీతూ జోసెఫ్
- సంగీతం : అనూప్ రూబెన్స్
- విడుదల తేదీ : నవంబర్ 25, 2021 (అమెజాన్ ప్రైమ్).
Video Advertisement
స్టోరీ :
కథ ముగిసిన ఆరేళ్ల తర్వాత సినిమా మొదలవుతుంది. రాంబాబు (వెంకటేష్) సినిమా తీద్దామని అనుకుంటూ ఉంటాడు. అదే పనిలో తిరుగుతూ ఉంటాడు. ఈ సంఘటన జరిగిపోయి ఆరు సంవత్సరాలు అయినా సరే ఆ కుటుంబం మాత్రం ఇంకా అందులో నుండి బయటికి రాదు. రాంబాబు పెద్ద కూతురు మానసిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. రాంబాబు భార్య కూడా ముందులాగా ఉండలేకపోతుంది. అనుకోని సంఘటనల వల్ల, ఆ మర్డర్ కేస్ విషయం మళ్ళీ వెలుగులోకి వస్తుంది. ఈసారి గట్టి సాక్ష్యాధారాలు ఉండడంతో రాంబాబు కుటుంబం చిక్కుల్లో పడుతుంది. ఇప్పుడు రాంబాబు ఏం చేశాడు? అసలు ఆ రోజు నిజంగా ఏం జరిగింది? అప్పుడు రాంబాబు చెప్పిన కథంతా నిజమేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
మొదటి భాగంలాగానే రెండవ భాగం కూడా మలయాళం సినిమాకి రీమేక్. ఇంకొక విషయం ఏంటంటే మలయాళం సినిమాకి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్, తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహించారు. మొదటి భాగాన్ని, రెండవ భాగాన్ని పోల్చి చూస్తే, రెండవ పార్ట్ లో సస్పెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సినిమా చాలా మామూలుగా మొదలవుతుంది. అసలు ఏం జరుగుతోంది అనేది కొంత సమయం వరకు అర్థం కాదు. కానీ సినిమా ముందుకు వెళుతున్న కొద్దీ సస్పెన్స్ మొదలవుతుంది. ఎప్పుడైతే సినిమాలోని అసలు పాయింట్ తెరపై చూపించారో, అప్పటినుండి కథ అంతా ఆసక్తికరంగా సాగుతుంది.
నటన విషయానికొస్తే, రాంబాబుగా వెంకటేష్ చాలా బాగా నటించారు. అలాగే రాంబాబు భార్యగా నటించిన మీనా కూడా తన పాత్రకు న్యాయం చేశారు. డబ్బింగ్ తనే చెప్పుకోవడంతో ఇంకా నాచురల్ గా అనిపించింది. అంతే కాకుండా వీరిద్దరి కూతుర్లుగా నటించిన కృతిక, ఎస్తేర్, అలాగే సహాయ పాత్రల్లో నటించిన నదియా, నరేష్, సంపత్, సత్యం రాజేష్, షఫీ, తనికెళ్ల భరణి కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సినిమా చివరిలో సినిమాకి ఇంకొక భాగం కూడా ఉంటుంది అని ఒక హింట్ ఇచ్చారు. మరి అందులో ఏ ట్విస్ట్ ఉండబోతోందో తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ
- నటన
- కొన్ని ఊహించని ట్విస్ట్ లు
మైనస్ పాయింట్స్:
- స్లోగా నడిచే కొన్ని సీన్స్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
మొదటి భాగం లాగానే రెండవ భాగం కూడా సస్పెన్స్ తో సాగుతుంది. రీమేక్ అయినా కూడా మన నేటివిటీకి తగ్గట్టుగా ఉంది. కథ బలంగా ఉండడంతో, సినిమా చూసే ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టదు.
End of Article