Ads
దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన మరొక సినిమా కాంత. ఇది ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తమిళ్ లో రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
చిత్రం : కాంత
నటీనటులు : దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి.
నిర్మాత : సెల్వమణి సెల్వరాజ్
దర్శకత్వం : రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్
సంగీతం : ఝాను చంథర్
విడుదల తేదీ : నవంబర్ 14, 2025

స్టోరీ :
అయ్య (సముద్రఖని ), ఆయన శిష్యుడు టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్). అయ్యకి తన తల్లి జీవితం ఆధారంగా శాంత అనే సినిమా తీయాలి అని ఉంటుంది. తీయాలి అని నిర్ణయించుకుంటాడు కూడా. అందులో మహదేవన్ హీరో. అయితే, సినిమా చేసే సమయానికి మహదేవన్ చాలా పెద్ద హీరో అయిపోతాడు. అందుకే తన అభిమానులకి నచ్చే విధంగా క్లైమాక్స్ మార్చాలి అని అంటాడు. అంతే కాకుండా, శాంత సినిమా పేరు మార్చి కాంత అని పెడతాడు.
కుమారి (భాగ్యశ్రీ) కూడా అయ్య శిష్యురాలే. ఆమె ఈ సినిమాలో హీరోయిన్. ఆ తర్వాత అనుకోకుండా సెట్ లో సంఘటన జరుగుతుంది. అప్పుడు వస్తాడు దేవరాజ్ (రానా దగ్గుబాటి). ఆ సంఘటన ఏంటి? అయ్య తాను అనుకున్న విధంగా సినిమా తీయగలిగాడా? కుమారి అయ్య చెప్పినట్టే నటించిందా? అసలు ఆ సంఘటనలో నిందితులు ఎవరు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే మహానటి సినిమాలో దుల్కర్ ని చూసినట్టు అనిపిస్తుంది. కానీ సినిమా చూసినప్పుడు మాత్రం ఆలా ఉండదు. ఈ సినిమాకి ముఖ్యమైన హైలైట్ నటీనటుల పెర్ఫార్మన్స్. అందరూ బాగా నటించారు. హీరోయిన్ భాగ్యశ్రీ కూడా తనకి ఇచ్చిన పాత్రలో చాలా బాగా నటించారు. పాటలు అంత గుర్తు పెట్టుకునే విధంగా లేకపోయినా, అలా వెళ్లిపోతాయి. జేక్స్ బిజాయ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సెట్టింగ్స్ ఆ కాలంలోని సినిమాలని తలపించేలా ఉంటాయి. మధ్యలో కొంచెం ల్యాగ్ తప్ప సినిమా అంతా కూడా ఒక ఫ్లోలో సాగుతుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పెర్ఫార్మన్స్
- ఆ కాలానికి తగ్గట్టుగా అనిపించే సెట్టింగ్స్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- ల్యాగ్ అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
దుల్కర్ సల్మాన్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా ఈ సినిమా నిలుస్తుంది.
End of Article
