షారుక్ ఖాన్ “డంకీ” ఫస్ట్ రివ్యూ..! ఎలా ఉందంటే..?

షారుక్ ఖాన్ “డంకీ” ఫస్ట్ రివ్యూ..! ఎలా ఉందంటే..?

by kavitha

Ads

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. షారూఖ్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ మరి కొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీతో షారూఖ్ హ్యాట్రిక్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు.

Video Advertisement

పాపులర్ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం షారూఖ్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ మరియు బీఎఫ్ఎఫ్సీ సెన్సార్ రిపోర్ట్‌ కూడా బయటకు వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్, తాప్సి జంటగా నటించిన సినిమా డంకీ. ఈ మూవీలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్ మరియు అనిల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే  విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్లు ఈ మూవీ పై ఆసక్తిని రేకెత్తించాయి. షారుక్ హీరోగా నటించడం, రాజ్ కుమార్ హిరానీ లాంటి దిగ్గజ దర్శకుడు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ మూవీ డిసెంబర్ 21న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో డంకీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.
what is happening with dunki movieట్రైలర్ తో మూవీ పై ఆసక్తి ని క్రియేట్ చేసిన, రాజ్ కుమార్ హిరానీ ఆడియెన్స్ అంచనాలను మాత్రం అందుకోలేక పోయాడంటూ టాక్. ప్రధమార్ధం చెత్తగా ఉందని, ఇక ద్వితీయార్ధం ఎమోషనల్ సీన్స్ తో నెట్టుకొచ్చారట. కొన్ని సీన్స్, అలాగే ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ కదిలిస్తాయని, మిగతాది బోర్ ఫీల్ అయ్యేలా ఉందట. హిరానీ ఎప్పటిలానే ఈ చిత్రంతో కూడా సందేశం ఇచ్చాడట.
మున్నాభాయ్ ఎంబీబీఎస్ నుండి సంజు వరకు అద్భుతమైన చిత్రాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమా విషయంలో తడబడ్డట్టు సమాచారం. మరో వైపు డంకీ  మూవీ పై బీఎఫ్ఎఫ్సీ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ మూవీలో బలమైన హిం-స, లైం-గి-క బెదిరింపులు, భయానక, ఆ-త్మ-హ-త్య, అడల్ట్ కామెడీ మరియు డ్రగ్స్ వంటి అంశాలు ఉన్నాయని షాకింగ్ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది.

Also Read: సలార్ టిక్కెట్లు కోసం గంటల తరబడి లైన్లో ఉన్నారు… ఓటు వేయమంటే వెయ్యరు…


End of Article

You may also like