Ads
నిజానికి ఎందులోనైనా విజయం సాధించాలంటే ఒక చిన్న ఆలోచన చాలు. ఆ ఆలోచనతో కష్టపడుతూ ముందుకు వెళితే విజయం దానంతట అదే వస్తుంది. అంతే కానీ లేనిపోని ఆలోచనలు, అనుమానాలు పెట్టుకుని వచ్చిన మంచి ఆలోచనని కూడా ముందుకు తీసుకు వెళ్ళకుండా ఉంటే విజయం ఎలా వస్తుంది..? అయితే ఈ యువ జంట కి వచ్చిన ఒక మంచి ఆలోచన ఇప్పుడు కోట్లు కురిపిస్తోంది.
Video Advertisement
మరి ఒక్క ఆలోచనతో ఈ యువజంట జీవితం ఎలా మారిపోయింది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో చాలా మంది టీ, కాఫీ వంటి వాటిని అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ యువ జంట కూడా ‘డికాక్షన్’ పేరుతో టీ, కాఫీలను అమ్ముతున్నారు. ఈ చిన్న ఆలోచన ద్వారా వాళ్ళు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. ఏకంగా వంద చోట్ల వాళ్ళు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే.. అద్దేపల్లి సంతోషి, ఉదయ్ కిరణ్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు.
కరోనా మహమ్మారి సమయంలో వీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో కూడా వీళ్లు ఈ బిజినెస్ ని మొదలు పెట్టారు. ఏప్రిల్ నాటికి 130 అవుట్ లెట్స్ దాటుతాము అని ఆనందంగా తెలుపుతున్నారు. కేవలం ఒక్క హైదరాబాద్లోనే 70 కేంద్రాలు వీరికి ఉన్నాయి.
వీరు ఇక్కడ మిల్క్, షేక్స్, థిక్ షేక్స్, కాఫీ, టీ వంటి వాటిని అమ్ముతూ ఉంటారు. పైగా చాలా మందికి వీటి ద్వారా ఉపాధిని కల్పించారు. అక్టోబర్ 2020 లో హైదరాబాదులో మొదట దీనిని ప్రారంభించారు. మూడు నెలల పాటు ఈ దంపతులు ఎంతగానో కష్టపడ్డారు. ఇలా ఒక్కొక్క అవుట్లెట్ ని ప్రారంభించి బిజినెస్ ని విస్తరించారు. నిజానికి సాధించాలి అనే సంకల్పం ఉండి.. దానికి తగ్గ కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చు అని ఈ జంట రుజువు చేసింది. మరి ఈ జంట మరెంత ఎత్తుకి వెళ్లాలని ఆశిద్దాం. అలానే వీరి విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ముందుకు వెళ్దాం.
End of Article