2020 స్టార్టయినప్పటి నుండి దెబ్బ మీద దెబ్బ లా ఏదో ఒక నెగటివ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి..ఇంకా కరోనా కలవరం పోనే లేదు..మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు..మన భూమి చుట్టూఅయస్కాంత క్షేత్రం ఉంటుంది కదా.. అది బలహీనంగా అయిపోయిందనేదే ఆ షాకింగ్ న్యూస్..అలా ఎందుకు జరిగింది అనే దానికి సరైన కారణాలు శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టడం లేదు..ఈ అయస్కాంత క్షేత్రం బలహీన పడడం వలన కలిగే నష్టాలేంటో తెలుసా..

Video Advertisement

సౌత్ అట్లాంటిక్ ఎనోమలీ అని పిలిచే ఏరియా.. కొన్నేళ్లుగా విస్తరిస్తూ ఉంది. అంటే అయస్కాంత క్షేత్రాల బలహీనత తగ్గుతుందని అర్థం. ఇంతకు ముందు 24000 నానోటెస్లాస్ ఉండే అయస్కాంత క్షేత్ర బలం.. ప్రస్తుతం 22000 నానోటెస్లాస్‌కి చేరిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సైంటిస్టులు పేర్కొన్నారు.ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికాల మధ్య భూమిలో ఉన్న అయస్కాంత క్షేత్రం బలహీనపడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎప్పటి నుంచో ఈ ఎనామలీపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, తాజాగా నైరుతీ ఆఫ్రికాలో మరో కొత్త ఎనామలీ మొదలైందని, అది అంతకంతకూ పెరుగుతూనే పోతుందని గుర్తించారు.ఇక ఈ మార్పులతో భూమిలోపల ఎలాంటి చర్యలు చోటుచేసుకుంటాయో కనుగొనడం తమకు అతి పెద్ద సవాల్ అని నిపుణులు చెబుతున్నారు..7,80,000 సంవత్సరాల క్రితం ఉత్తరధృవం, దక్షిణ దృవం తిరగబడ్డాయని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు..మళ్లీ అలాంటి మార్పు జరగడానికి చాలా సమయం ఉందని అన్నారు.

టెలీకమ్యునికేషన్, శాటిలైట్లు పని చేయాలంటే భూ అయస్కాంత క్షేత్రంపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అయస్కాంత క్షేత్రం బలహీన పడడం వలన ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ల కమ్యునికేషన్ కొంతవరకూ దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అలాటే టెలీకమ్యునికేషన్, మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

అలాగే ఆ రెండు ఎనామలీలు ఉన్న ప్రాంతాల్లో విమానాలకు కూడా టెక్నికల్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని అంటున్నారు..మరోవైపు అయస్కాంత క్షేత్రం తిరగబడడానికి చాలా సమయం ఉంది కావున ఈ ప్రమాదాలు సంభవించకపోవచ్చు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. చూడాలి ఏం జరుగుతుందో…