సాధారణం గా జలుబు చేయడం అనేది మనం చిన్న విషయం గానే భావిస్తాం. ప్రస్తుతం కరోనా నేపధ్యం లో ఎక్కువ భయపడుతున్నాం. సీజన్ మారినప్పుడల్లా, ఎక్కువ చలి, వర్షాలు కురుస్తున్నపుడు జలుబు చేస్తుండడం సహజమే. అయితే.. అస్తమానం జలుబు చేస్తోందంటే ఆలోచించాల్సిన విషయమే. ఇందుకోసం మీరు తీసుకునే ఆహరం లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

broccoli

ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అన్నిటిని బ్యాలన్స్డ్ గా తీసుకోవాలి. వీటితో పాటు తాజా పండ్లను కూడా ఆహరం లో భాగం చేసుకోవాలి. వీటితో పాటు బ్రకోలి ని కూడా మీ ఆహరం లో భాగం చేసుకోవడం మంచిదే. సాధారణం గా వచ్చే జలుబుని తగ్గించడం లో బ్రకోలి సూపర్ ఎక్స్పర్ట్ గా పని చేస్తుంది. కేవలం కొద్దీ రోజుల్లోనే ఇది జలుబుని తగ్గించగలుగుతుంది. బ్రకోలి లో ఫైటో కెమికల్స్ తో పాటు విటమిన్స్ (సి, ఏ, ఈ, కే) జింక్, ఐరన్ వంటి మినరల్స్ కూడా పుష్కలం గా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.అందుకే బ్రకోలి తీసుకోవడం మంచిది.