Ads
పెళ్లి అనేది జీవితంలో ఓ ముఖ్యమైన, అనిర్వచనీయమైన ఘట్టం. వివాహం అనే మధురమైన ఘట్టం ప్రతి ఒక్క జంటకూ ఎంతో ప్రత్యేకం. జీవితం లో ఒకేసారి చేసుకొనే గొప్ప వేడుక. అందుకే ఫంక్షన్ హాల్ మొదలుకుని వెడ్డింగ్ కార్డ్స్, ఫొటోషూట్, ఫుడ్ మెను, అతిథులకు రిటర్న్ గిఫ్ట్స్ వంటివి ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు. తమ పెళ్లి కలకాలం అందరికీ గుర్తుండాలి కోరుకుంటారు. అయితే ఓ జంట మాత్రం వినూత్నంగా ఆలోచించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
Video Advertisement
ఇప్పుడు ట్రెండ్ మారింది.. కొత్త తరహాలో ఆలోచిస్తోంది యువతరం.. ముఖ్యంగా తమ పెళ్లి విషయంలో మరింత క్రియేటివిటీని యాడ్ చేసుకుంటున్నారు. పెళ్లికార్డు నుంచి.. పెళ్లి వేదిక.. ఇతర కార్యక్రమాలు అన్నీ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని భోపాల్ లోని జహంగీరాబాద్ లో అల్ఫర్హాన్ ఉద్దీన్, ఇక్రా మన్సూర్ కుటుంబాలు నివసిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్ళి జరిగింది. పెళ్ళికి ఆహ్వానించడం నుండి పెళ్ళి తరువాత రిసెప్షన్ వరకు ఎవ్వరూ ఊహించని విధంగా ఏర్పాట్లు చేశారు. అసలు వీరు పెళ్ళికి పిలిచిన పద్దతే అందరినీ షాక్ తినేలా చేసింది.
పెళ్ళి పత్రికను నేరుగా కాకుండా అందరికీ సాప్ట్ కాపీని మొలైల్ లో పంపారు. పెళ్ళి పత్రికల కోసం కాగితం వృథా చెయ్యడం ఇష్టం లేక ఇలా చేశారట. అలాగే పెళ్ళికి వచ్చిన అతిథులకు స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసులు ఉపయోగించి భోజనాలు ఏర్పాటు చేశారు. టీ అందించడం కోసం మట్టి కప్పులు ఉపయోగించారు. పానీ పూరి ని ఆకులతో తయారు చేసిన కప్స్ లో సర్వ్ చేసారు. ఫంక్షన్ హాల్ అంతా తాజా పువ్వులతో, ఆకులతో అలంకరించారు. అంతే కాకుండా పెళ్ళికూతురు తానే స్వయంగా సెల్ఫీ పాయింట్ తయారు చేసింది దీనికోసం వృథాగా ఉన్న సైకిల్ టైర్ లు, ధర్మాకోల్ షీట్లు, పువ్వులు ఉపయోగించింది.
చివరిగా రిటర్న్ గిఫ్ట్స్ గా మొక్కలను ఇచ్చారు. అలాగే ఆహరం వృధా కాకుండా కావలసినంత మాత్రమే పెట్టుకుని తినేలా అందరినీ కన్విన్స్ చేశారు. ఇలా ఈ జంట పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మ్యారెజ్ చేసుకున్నారు. వీరి పెళ్ళికి సుమారు 400మంది అతిథులు హాజరయ్యారట. వరుడు పర్యావరణ పరిరక్షణ కోసం పానీ చేసే గ్రూప్ లో సభ్యుడిగా ఉన్నాడట.. దానికి తన కాబోయే భార్య సహకారం కూడా లభించడంతో వీరి పెళ్లి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
End of Article