Ads
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకొని, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు దీపిక పదుకొనే. దీపిక ఇప్పుడు గర్భవతిగా ఉన్నారు. అయినా కూడా ఇటీవల జరిగిన కల్కి 2898 ఏడి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో దీపిక హై హీల్స్ వేసుకొని వచ్చారు. దీపిక దాదాపు 5 నెలల గర్భవతిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో హై హీల్స్ వేసుకోవచ్చా అనే సందేహం అందరిలో నెలకొ. దీపిక మాత్రమే కాదు. గతంలో చాలా మంది సెలబ్రిటీలు ఇలాగే గర్భవతిగా ఉన్నప్పుడు హై హీల్స్ వేసుకొని కనిపించారు.
Video Advertisement
మామూలుగానే హై హీల్స్ వేసుకుంటే కాళ్ల నొప్పులు వస్తాయి అని చాలా తక్కువగా హీల్స్ వేసుకుంటూ ఉంటారు. అలాంటిది, గర్భవతిగా ఉన్నప్పుడు హై హీల్స్ వేసుకుంటే ఇంకా ఇబ్బందులు వస్తాయి ఏమో అనే సందేహం అందరిలో నెలకొంది. ఈ విషయంపై డాక్టర్లు మాట్లాడుతూ, గర్భవతిగా ఉన్న సమయంలో హై హీల్స్ వేసుకోకూడదు అని తెలిపారు. ఒకవేళ అలా వేసుకుంటే కాళ్ల నొప్పులు రావడం మాత్రమే కాకుండా, తర్వాత కూడా వెన్నునొప్పి వచ్చి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కీళ్ల నొప్పులు, నడుము దగ్గర భాగంలో నొప్పి కూడా వస్తుంది అని చెప్పారు.
అంతే కాకుండా నడుము మీద, వెన్నెముక భాగ మీద ఒత్తిడి పడుతుంది అని దాని వల్ల ఇబ్బంది అవుతుంది అని తెలిపారు. గర్భవతిగా ఉన్న సమయంలో ఫ్లాట్ చెప్పులు వేసుకోవాలి అని చెప్పారు. ఫ్లాట్ చెప్పుల్లో కూడా గట్టిగా ఉన్న చెప్పులు కాకుండా, మెత్తగా ఉన్న చెప్పులు వేసుకుంటే మంచిది అని తెలిపారు. సాధారణంగానే గర్భవతిగా ఉన్న సమయంలో మోకాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పాదాల మీద కూడా ఒత్తిడిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి. నెలలు పెరుగుతున్న కొద్ది జాగ్రత్తలు ఇంకా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా హై హీల్స్ లాంటివి వేసుకోవడం అనేది పూర్తిగా తగ్గించేయాలి. సాధారణమైన చెప్పులు మాత్రమే ఉపయోగించాలి అనే డాక్టర్లు తెలిపారు.
End of Article