Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. 2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా మీద మహేష్ బాబు ఫ్యాన్స్ కి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ధమ్ మసాలా సాంగ్ సూపర్ హిట్ అయింది. అయితే గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Video Advertisement
అదేంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా డైరెక్టర్ త్రివిక్రమే. ఈ సినిమా క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ కి తన అత్తకి మద్య ఒక ఎమోషనల్ సీన్ వస్తుంది. ఈ సీన్ సినిమాకి ప్రాణంగా నిలిచింది. ఇప్పుడు అలాంటి సీను ఒకటి గుంటూరు కారం సినిమాలో ఉంటుందట. ఆ సీను మహేష్ బాబుకి తన తల్లికి మధ్య వస్తుందని అంటున్నారు. ఇదే గనక నిజమైతే మహేష్ బాబు ఫ్యాన్స్ కి నిజంగా పండగే. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ లో మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తారు.
ఇక త్రివిక్రమ్ అటువంటి సీన్స్ లో డైలాగ్స్ ని ఎంత పదునుగా రాస్తారో చెప్పాల్సిన పనిలేదు. గుంటూరు కారం సినిమా దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. డిసెంబర్ 25 లోపు మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తర్వాత నుండి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లుగా తెలిపారు. ఈ సినిమాలో మహేష్ బాబుకి జంటగా శ్రీ లీల,మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే.
End of Article