Ads
ప్రముఖు టాలీవుడ్ నటుడు మరణించిన వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన చనిపోయిన మూడు రోజుల తర్వాత ఇది బయటకు వచ్చింది. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన స్వర్గం-నరకం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈశ్వరరావు. మొదటి సినిమాతోనే ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే సినిమాలో విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా నటుడుగా మారిన సంగతి తెలిసిందే.
Video Advertisement
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఈశ్వరరావుకి ఆఫర్లు క్యూ కట్టాయి.హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించారు.తల్లి దీవెన, బొమ్మరిల్లు, కన్నవారి ఇల్లు వంటి చిత్రాల్లో హీరోగా నటించి…ప్రేమాభిషేకం, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, ఘరానా మొగుడు , జయం మనదే, శభాష్ గోపి వంటి సూపర్ హిట్ సినిమాల్లో ముఖ్య పాత్రులు చేశారు.
దాదాపు 200 పైగా సినిమాల్లో ఈయన నటించారు. ఆయన చివరిసారి నటించింది సినిమా చిరంజీవి ఘరానా మొగుడు లోనే. అనంతరం బుల్లితెరపై పలు ధారావాహికల్లో కూడా నటించారు.స్వర్గం నరకం సినిమాలో తన నటనకు గాను ఈశ్వరరావు నంది అవార్డు కూడా అందుకున్నారు.మొదటి సినిమా తోటే నంది అవార్డు అందుకున్న నటుడిగా రికార్డు సృష్టించారు .
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటే ఈశ్వర రావు చివరిగా ఒక తెలుగు ఛానల్ ఇంటర్వ్యూ లో కనిపించారు. తర్వాత అనారోగ్యం కారణంగా అమెరికాలో కూతురి నివాసంలో ఉంటున్నారు. అక్టోబర్ 31న ఆయన అనారోగ్యంతో తుది శ్వాస విడిచినట్లు సమాచారం.ఈశ్వరరావు మరణ వార్త విని టాలీవుడ్ లో ప్రముఖుల సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కొందరైతే ఆయనతో ఉన్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.
Also Read: RRR “కొమరం భీముడో” పాటని… సీన్-టు-సీన్ కాపీ కొట్టేసారుగా..? ఏ సినిమా నుండి అంటే..?
End of Article