బొడ్డులో ఏర్పడే ఆ వింత పదార్థం ఏంటో తెలుసా.? అది ఎందుకు ఏర్పడుతుంది అంటే.?

బొడ్డులో ఏర్పడే ఆ వింత పదార్థం ఏంటో తెలుసా.? అది ఎందుకు ఏర్పడుతుంది అంటే.?

by Megha Varna

Ads

సాధారణంగా చాలా మందికి బెల్లీ బటన్ (బొడ్డు) లో ఫైబర్ లాంటిది ఏర్పడుతుంది. దాన్ని నేవెల్ లింట్ లేదా బెల్లీ బటన్ లింట్ అని అంటారు. అందరికీ కాకపోయినా కొంతమందికి తరచుగా ఈ నేవెల్ లింట్ అనేది ఏర్పడుతుంది. దానికి కారణం ఏంటంటే. సాధారణంగా ఒక మనిషి వివిధ రకాల క్లాత్ తో చేసిన దుస్తులను ధరిస్తారు. అలా ఒక మనిషి వాడే క్లాత్ నుండి వచ్చే వ్యర్థం (ఫైబర్) తో డెడ్ స్కిన్ సెల్స్, అలాగే బాడీ హెయిర్ కలిసి నేవెల్ లింట్ ఫార్మ్ అవుతుందట.

Video Advertisement

బాడీ హెయిర్ ఫ్రిక్షన్ ద్వారా ఫైబర్ బెల్లీ బటన్ లో ట్రాప్ అవుతుందట. ఈ నేవెల్ లింట్ అనేది బ్లూ లేదా గ్రే కలర్, అంటే ఒక మనిషి యావరేజ్ గా డైలీ వేర్ లో ఎక్కువగా వాడే కలర్స్ లో ఉంటుందట. అలాగే ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళకి బాడీ హెయిర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మగవాళ్ళకి ఈ లింట్ ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉంటాయట.

నేవెల్ లింట్ ఏర్పడకుండా ఉండాలి అంటే కాటన్ దుస్తులు ధరించే ముందు ఒక సారి వాష్ చేసి ధరించాలట. కొంతమంది పియర్సింగ్ పద్ధతిని కూడా ఆశ్రయిస్తారు. అలాగే వ్యాక్సింగ్, షేవింగ్, లేదా లేజర్ ట్రీట్మెంట్ లాంటి హెయిర్ రిమూవల్ పద్ధతులు ఉపయోగించవచ్చట. దీనివల్ల అంటే ఈ బెల్లీ బటన్ లింట్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదట, కానీ ఎప్పటికప్పుడు నేవెల్ లింట్ క్లీన్ చేయాలట.


End of Article

You may also like