ఈ 10 మందిని మనం రోజూ మీమ్స్ లో చూస్తూనే ఉంటాం..వాళ్ళు ఎవరో, ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

ఈ 10 మందిని మనం రోజూ మీమ్స్ లో చూస్తూనే ఉంటాం..వాళ్ళు ఎవరో, ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

by Anudeep

Ads

మనలో పొద్దున్న లేవగానే.. రాత్రి పడుకునే వరకు అందరం కామన్ గా చేసే పని ఫేస్ బుక్ వాడడం. మనం పుస్తకాలు కూడా ఇంత బాగా చదవవేమో కానీ.. ఫేస్ బుక్ ని స్క్రోల్ చేయమంటే మాత్రం బాగా చేస్తాం. అయితే.. మనం అంత లా ఫేస్ బుక్ కి కనెక్ట్ అయిపోవడానికి కారణం మన ఫ్రెండ్స్, అండ్ మీమ్స్ కూడా.

Video Advertisement

మనలని బాగా ఎంటర్టైన్ చేసేవి ఫన్నీ వీడియోస్, మీమ్స్ ఇవే కదా.. అయితే.. ఈ మీమ్స్ వలన కూడా పాపులర్ అయినా వాళ్ళు కొందరు ఉన్నారండోయ్. వీళ్ళ ఫేసెస్ ని మనం మీమ్స్ లో యూజ్ చేసేసుకుంటున్నాం, స్టికర్స్, జిఐఎఫ్ లలో కూడా వాడేసుకుంటున్నాం. ఈ ఫేసెస్ చుస్తే మీకు కూడా తెలిసే ఉంటుంది. కానీ, వీళ్ళు రియల్ గా ఎవరు? ఎలా ఉంటారు..? ఏమి చేస్తారు.. వంటి విషయాలు మనం ఈరోజు ఆర్టికల్ లో చూసేద్దాం..

#1 సక్సెస్ కిడ్ – సామ్ గ్రినర్

ఇతని ఫోటో మీమ్స్ లోకి 2007 లో వచ్చింది. 2007 లో లానీ గ్రినర్ అనే వ్యక్తి ఇసుక తినడానికి ప్రయత్నిస్తూ ఉన్న తన కొడుకు సామ్ ఫోటో ను క్లిక్ మనిపించాడు. అలా ఈ ఫోటో మొదట “‘ఐ హేట్ శాండ్‌కాజిల్స్'” మీమ్ పేరిట బాగా పాపులర్ అయింది. ఆ తరువాత ఈ ఫోటో ను “సక్సెస్ కిడ్” మీమ్ గా మార్చేశారు. వివిధ ప్రకటనలు, ఎక్స్‌బాక్స్ స్క్రీన్‌సేవర్‌ వంటి అడ్వేర్టైజ్మెంట్ లకు ఈ ఫోటో ను వాడేస్తున్నారు. ప్రస్తుతం సామ్ వయసు 13 సంవత్సరాలు. అతను తన పేరెంట్స్ కలిసి నివసిస్తున్నాడు.

#2 డాగ్ కాబోసు:


ఈ డాగ్ ఫోటో 2013 నుంచి వైరల్ అవుతోంది. ఆ డాగ్ ఎక్స్ప్రెషన్ వల్లే ఈ ఫోటో పాపులర్ అయింది. ఈ డాగ్ నేమ్ కాబోసు. కాబోసు ఓనర్ షీబా ఇను తన పర్సనల్ బ్లాగ్ లో ఈ ఫోటో ను పోస్ట్ చేసారు. ఆ తరువాత ఆమె ఇంస్టాగ్రామ్ స్టార్ అయిపోయారు. ఈ డాగ్ కి ఇప్పుడు ఆమె వద్దే ఉంది.

#3 డిసాస్టర్ గర్ల్ – జో రోత్


ఈ పిక్చర్ ను 2004 లో జో రోత్ తండ్రి డేవ్ రోత్ కాప్చర్ చేసారు. ఉత్తర కరోలినాలోని వారి ఇంటి నుండి రెండు బ్లాకుల దూరంలో ఉన్న మంటలను అగ్నిమాపక సిబ్బంది నియంత్రించడాన్ని ఆమె గమనించింది. ఆ సమయం లోనే ఆమె తండ్రి ఈ ఫోటో తీశారు. ఈ ఫోటో ను డేవ్ ఓ ఫోటో కాంపిటీషన్ కు పంపించగా.. ఆయన గెలుపొందారు. ప్రస్తుతం ఈ అమ్మాయి ఫోటో లో చూపినట్లు ఉంది.. ఇంటర్నెట్ కు దూరం గా.. తన ఫ్రెండ్స్ , ఫామిలీ తో హ్యాపీ గా ఉంది.

#4 సైడ్ ఐయింగ్ క్లోయ్ – క్లోయ్(chloe)


ఈ ఫోటో 2013 తరువాత వైరల్ అయింది. KAftC అనే యూట్యూబర్ ఓ వీడియో ను యూట్యూబ్ లో పోస్ట్ చేయడం వలన ఈ ఫోటో వెలుగులోకి వచ్చింది. ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలో తెలియక పెట్టిన ఈ ఫేస్ బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె ఇంస్టాగ్రామ్ లో చాలా పాపులర్. ఆమెకు 582 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

#5 బ్లింకింగ్ వైట్ గై – డ్రూ స్కాన్లాన్


ఈ ఐకానిక్ GIF మనందరికీ తెలుసు.. ఇందులో ఆక్ట్ చేసింది డ్రూ స్కాన్లాన్. ప్రముఖ గేమింగ్ వెబ్‌సైట్ అయిన గేమింగ్ బాంబ్‌లో డ్రూ వీడియో నిర్మాతగా ఉన్నప్పుడు 2013 లో ఈ GIF చిత్రీకరించబడింది. గేమింగ్ సెషన్లలో ఒకదానిలో, డ్రూ తన ఎడిటర్-ఇన్-చీఫ్ స్టార్ బౌండ్ ను ఆడడాన్ని చూసాడు. ఈ సమయం లో అతను మాటలకు డ్రు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది. ఈ ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ ట్రేండింగ్ లోనే ఉంది.

#6 హారొల్ద్ హైడింగ్ ది పెయిన్


ఇతను సీనియర్ స్టాక్ ఫోటోగ్రఫీ మోడల్. మనలో అణిచివేయబడిన పెయిన్ ను చూపించే ఎక్స్ప్రెషన్ తో ఉన్న ఈ ఫోటో ఇప్పుడు ట్రేండింగ్ లో ఉంది. ఇతని పేరు ఆండ్రేస్ అరాటే. 2011 లో ఈ ఫోటో బాగా వైరల్ అయింది. ఈ ఫోటో 2019 లో, అరాటే హంగేరిలో కోకాకోలాకు ప్రకటనల ముఖంగా మారింది మరియు 2020 లో, అతను మాస్క్డ్ సింగర్ యొక్క హంగేరియన్ ఎడిషన్‌లో నటించాడు. అరాటే ప్రస్తుతం తన భార్య గాబ్రియెల్లా మరియు అతని కుమారుడితో కలిసి బుడాపెస్ట్‌లో నివసిస్తున్నారు.

#7 రోల్ సేఫ్ – కయోడ్ ఎవూమి


ఇతని పేరు కయోడ్ ఎవూమి. ఇతను ఫన్నీ గా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇంటర్నెట్ లో ట్రేండింగ్ గా ఉన్నాయి. 2016 లో ఈ ఫోటో బాగా పాపులర్ అయింది. ఈ ఎక్స్ప్రెషన్ అతను చేసిన చిన్న ‘హుడ్ డాక్యుమెంటరీ’లో ఓ భాగం. అతని ప్రతిభతో బీబీసీ అటెన్షన్ ను కూడా సాధించాడు. అతను బిబిసి యొక్క తాజా ప్రదర్శన ఎంటర్పీస్లో కూడా ఒక పాత్ర పోషించాడు.

#8 ఫస్ట్ వరల్డ్ ప్రొబ్లెమ్స్ – సిల్వియా బొట్టిని


ఈమె ఒక మోడల్. మీకు తెలియకపోతే, ‘ఫస్ట్-వరల్డ్ ప్రాబ్లమ్స్’ మీమ్ లోని ఈ మహిళ వాస్తవానికి అవార్డు గెలుచుకున్న ఇటాలియన్ నటి మరియు ఇప్పుడు మోడల్.

#9 గుడ్ లక్ చార్లీ – మియా టాలెరికో


మియా టాలెరికో నటించిన ఈ మీమ్ డిస్నీ ఛానల్ షో “గుడ్ లక్ చార్లీ” లోని ఒక సన్నివేశం నుండి పుట్టింది. ఈ ఫోటో మరియు GIF ఎక్కువగా “నాకు తెలియదు” కు పర్యాయపదంగా ఉపయోగించబడతాయి. మియా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ప్రాచుర్యం పొందింది మరియు ఆమెకు 1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

#10 ఎలియెన్స్ ఆర్ టు బ్లేమ్ ఎవ్రీ థింగ్ – జార్జియో


జార్జియో స్విస్ లో జన్మించారు. ఆమె రచయిత, యుఫాలజిస్ట్, టీవీ ప్రెజెంటర్ మరియు నిర్మాత. అతను “పురాతన ఎలియెన్స్” అనే టీవీ సీరియల్ లో నటించాక బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ ఈ షో లో అతను భాగం గానే ఉన్నాడు.


End of Article

You may also like