హైటెక్ కాపీ.. బ్లూటూత్ చెప్పులతో ఎగ్జామ్‌కు వెళ్లి అడ్డంగా బుక్ అయ్యారు.

హైటెక్ కాపీ.. బ్లూటూత్ చెప్పులతో ఎగ్జామ్‌కు వెళ్లి అడ్డంగా బుక్ అయ్యారు.

by Anudeep

Ads

కష్టపడి చదివి టాపర్స్ అయ్యే విద్యార్థులని చూసి ఉంటారు, చదవడానికి ఆశక్తి లేకనో నిర్లక్ష్యం వల్లనో చదవకుండా ఉండి పరీక్షల సమయంలో మాత్రం స్లిప్స్ పెట్టి లేదా కాపీలు కొట్టి పాస్ అయ్యే విద్యార్థుల ని చూసి ఉంటారు. ఇలా కాపీలు కొట్టిన విద్యార్థుల్ని మందలించో, మంచిగా చెప్పో మంచి మార్గంలో నడిపించాల్సినది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారే. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో అర్హత సాధించడం కోసం రాసే పరీక్షలలోనే కాపీ చేస్తే, అది కూడా హైటెక్ లెవల్లో చేస్తే ఆశ్చర్యపోవడం చూసేవారి వంతు అయ్యింది. రాజస్థాన్లో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్ష రాస్తున్న ఒక వ్యక్తి చెవిలో బ్లూటూత్ ని చూసిన ఇన్విజిలేటర్ కి అనుమానం రావడంతో అతనిని తనిఖీ చేయగా అతను వేసుకున్న చెప్పులలో మొబైల్ ఫోన్ ఉన్నట్లు తెలిసింది.

Video Advertisement

చెప్పులను రెండు భాగాలుగా చేసి చూడగా అందులో మొబైల్ ఫోన్ ఉంది. చెప్పులలో మొబైల్ ఫోన్, చెవిలో బ్లూటూత్ సహాయంతో అతను పరీక్ష పత్రంలో ఉన్న ప్రశ్నలను అడగగా బయట ఉన్న అతని స్నేహితులు అతనికి సమాధానం చెప్పసాగారు. అతనితో పాటు ఇంకో ఇద్దరిని కూడా ఇదే విధంగా చేస్తున్నట్లు గమనించి అదుపులోకి తీసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రశ్నించగా ఆశ్చర్యపోయే విషయం వెలుగుచూసింది. వారు ఉపయోగిస్తున్నా ఈ చెప్పులు ఒక ముఠా దగ్గర కొన్నాం అని వాటి ధర అక్షరాలా ఆరు లక్షల రూపాయలు అని చెప్పారు. అంతేకాక ఆ ముఠా దగ్గర ఇటువంటి చెప్పులను 23 మంది వ్యక్తులు కొన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు వారందరిని పట్టుకునే పనిలో ఉన్నామని తెలియజేశారు. కష్టపడి చదవకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉద్దేశంతో ఎలాంటి హైటెక్ మోసాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని పోలీసు వారు తెలియజేశారు.


End of Article

You may also like