నిజం గడపదాటేలోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టుముట్టి వస్తుంది..సోషల్ మీడియాకు ఈ సామెత మరింత ఎక్కువగా సూట్ అవుతోంది. ఆ సామెత పుట్టినప్పుడు ఏమో కాని ఈ సోషల్ మీడియాలో వచ్చేవి ఏవి నిజమో ,ఏది అబద్దమో అని తెలుసుకునే వెసలు బాటుంది.. కాని ఆ నిజం తెలుసుకునేలోపే ఆ న్యూస్ వైరల్ అయిపోయి ప్రపంచాన్ని చుట్టేస్తుంది. అందుకు తాజా ఉదాహరణ డా. మేఘావ్యాస్ ఘటన.

Video Advertisement

డా.మేఘావ్యాస్, పూణెకి చెందిన డాక్టర్. . కరోనా వారియర్.. కరోనా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేసి , వైరస్ సోకి మరణించింది అంటూ ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మామూలుగానే మనం దయార్ద్ర హృదయులం..ఇలాంటి న్యూస్ వస్తే ముందు వెనుకా చూడకుండా ఎడాపెడా శేర్ చేసి పడేస్తాం. ఆవిడ కరోనా సోకి చనిపోయింది..నిజం కాని ఆవిడ డాక్టర్ కాదు.. ఆవిడ పేరు మేఘా వ్యాస్ కాదు..మేఘా శ్యామ్..

India Today Anti Fake News War Room (AFWA) ఫేక్ న్యూస్ ని కట్టడి చేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంది.సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయంపైన ఒకటి కి రెండు సార్లు క్రాస్ చెక్ చేస్తూ నిజం ఏంటో బయటపెడుతోంది.  మేఘా వ్యాస్ పేరు మీద వైరల్ అవతున్న న్యూస్ కింద కొందరు చేసిన కామెంట్ “ఆమె మేఘా వ్యాస్ కాదు, మేఘా శర్మ, తనుడాక్టర్ కాదు, ఫూనెలోని జహంగీర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరిణించింది” అనే కామెంట్  ఆధారంగా నిజాలు బయటపెట్టగలిగింది AFWA.

స్వయంగా జహంగీర్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ డాక్టర్ చేత వ్రాతపూర్వకంగా లెటర్ తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పెట్టింది AFWA. మరోవైపు తన భార్య పేరు మీద ఫేక్ న్యూస్ క్రియేట్ చేసినవారిని,దానిని ఫార్వర్డ్ చేసిన వారిని వదిలిపెట్టనని, వారి పై కేసు పెడతానని అంటున్నారు మేఘా శర్మ భర్త శ్రీకాంత్ శర్మ. . కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేవి శేర్  చేసేముందు ఒకటి రెండు సార్లు ఫ్యాక్ట్ చెక్ చేస్కుని , శేర్ చేయండి..లేకపోతే లేని పోని సమస్యల్లో ఇరుక్కోవాల్సొస్తుంది.

source: Indiatoday