గూగుల్ ఇచ్చే ఈ ఫీచర్ తో ఫేక్ న్యూస్ ను కనుక్కోవచ్చని తెలుసా..? ఎలాగో చూడండి..!

గూగుల్ ఇచ్చే ఈ ఫీచర్ తో ఫేక్ న్యూస్ ను కనుక్కోవచ్చని తెలుసా..? ఎలాగో చూడండి..!

by Anudeep

స్మార్ట్ ఫోన్ లో ఎక్కువ గా అందుబాటులోకి వచ్చాక అవసరం ఉన్నవి.. లేనివి ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే ఫేక్ న్యూస్ లు కూడా ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా నేపధ్యం లో ఎక్కువ గా ఫేక్ న్యూస్ లు ప్రచారం అవుతుండడం తో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిల్లో ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టాలంటే మీరు ఈ ఫీచర్ గురించి తెలుసుకోవాల్సిందే.

Video Advertisement

fake news detection

ఈ కొత్త ఫీచర్ గురించి రీసెంట్ గా జరిగిన సమావేశం లో గూగుల్ వివరించింది. సెర్చ్ లో “అబౌట్​ దిస్​ రిజల్ట్​” అనే ఫీచర్ ను తీసుకురానుంది. దీనిద్వారా ఆ సమాచారం ఏ సోర్స్ నుంచి ప్రచారం అవుతోందో చూపించనుంది. దీనికోసం గూగుల్ వికీ పీడియా తో కలిసి పనిచేయబోతోంది. వికీపీడియా లో ఓపెన్ అండ్ ఎడిట్ కు అవకాశం ఉంటుంది.ఈ ఫీచర్ కూడా ప్రపంచవ్యాప్తం గా ఉండే వాలంటీర్ల సాయం తోనే పనిచేస్తుంది. అలాగే లింక్ లోడ్ అయ్యిన తరువాత హెచ్​టీటీపీఎస్​ ను బట్టి ఆ వెబ్ సైట్ సేఫ్ గా ఉందా లేదా అన్న విషయాన్నీ కూడా చెబుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ ఫీచర్ ను అమెరికా లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెలాఖరుకి ఇంగ్లీష్ లో అందరికి అందుబాటులోకి రానుంది.


You may also like