Ads
మన సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చారు. కొంత మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. అయితే ప్రతి యాక్టర్ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అలా మన తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న కొంత మంది హీరోలు ఎవరో, వారి కుటుంబాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 మెగా ఫ్యామిలీ
మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి తో పాటు పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ,నిహారిక కొణిదెల, కళ్యాణ్ దేవ్, అలాగే అల్లు అరవింద్ గారి కుటుంబం నుంచి శిరీష్ అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎంతో కష్టపడి తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు.
#2 నందమూరి ఫ్యామిలీ
నందమూరి ఫ్యామిలీ నుండి నందమూరి తారక రామారావు గారి తో పాటు నందమూరి హరికృష్ణ గారు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న అలాగే కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
#3 దగ్గుబాటి ఫ్యామిలీ
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
#4 అక్కినేని ఫ్యామిలీ
అక్కినేని ఫ్యామిలీ లో అక్కినేని నాగేశ్వర రావు గారితో పాటు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ,అలాగే వారి బంధువులు అయిన సుమంత్, సుశాంత్, సుప్రియ కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
#5 కృష్ణ ఫ్యామిలీ
సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుండి రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల, అలాగే గౌతమ్ కూడా వన్ నేనొక్కడినే సినిమాలో నటించాడు.
#6 మోహన్ బాబు ఫ్యామిలీ
మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
#7 సాయి కుమార్ ఫ్యామిలీ
సాయి కుమార్ గారి తండ్రి పీజే శర్మ గారు కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. వారి ఫ్యామిలీ నుంచి అయ్యప్ప పి శర్మ, రవి శంకర్, ఆది కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
#8 కమల్ హాసన్ ఫ్యామిలీ
కమల్ హాసన్ గారి ఫ్యామిలీ నుండి చారుహాసన్ గారు, సుహాసిని, అను హాసన్, శృతి హాసన్, అక్షర హాసన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
#9 ఉప్పలపాటి ఫ్యామిలీ
ఉప్పలపాటి కుటుంబం నుండి కృష్ణంరాజు గారి తో పాటు ప్రభాస్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అలాగే ప్రభాస్ సోదరుడు ప్రమోద్, అలాగే సోదరి ప్రసీద యు.వి.క్రియేషన్స్ బాధ్యతలు నిర్వహిస్తారు.
End of Article