సిరివెన్నెల సీతారామశాస్త్రికి త్రివిక్రమ్ ఏమవుతారో తెలుసా..? వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా వచ్చిందంటే..?

సిరివెన్నెల సీతారామశాస్త్రికి త్రివిక్రమ్ ఏమవుతారో తెలుసా..? వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా వచ్చిందంటే..?

by Anudeep

Ads

మాటలతోనే ఎదుటి వారిని కట్టివేయగల చాతుర్యం కలిగిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా ఆయనకి ఉన్న ఈ ఒక్క బిరుదు చాలు ఆయన మాటకారితనం ని చెప్పడానికి. ఆయన మాటలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో ఆయన దర్శకత్వం వహించే సినిమాలు కూడా అంటే ప్రత్యేకంగా ఉంటాయి.

Video Advertisement

స్వయంవరం ఈ సినిమాతో మాటల రచయితగా పరిచయం అయినా ఆయన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆయనకి ఉన్న ఈ ప్రత్యేకమైన టాలెంట్ వలన చేసిన కొద్ది సినిమాలతోనే ఎంతో ఖ్యాతిని గడించారు.

trivikram 1

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సోదరుడికి ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తెను పెళ్లిచూపులు చూసేందుకు రావాల్సి ఉందని కోరగా వెళ్లిన మాటల మాంత్రికుడు తనకు అక్కకి బదులుగా చెల్లి నచ్చింది ఆమెనే పెళ్లి చేసుకుంటా అని చక్కగా అక్కడ ఉన్న వాళ్లు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

trivikram 2

కానీ అప్పటికే మాటల మాంత్రికుడి మాయలో పడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు త్రివిక్రమ్ గారికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఇంకా అబ్బాయి కూడా చాలా మంచివాడు అని అందరికీ చెప్పి త్రివిక్రమ్ గారు రెండవ కూతురు అయిన సౌజన్య గారితో పెళ్ళికి ఒప్పించారు. అయితే పెద్ద కూతురు పెళ్లి అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందిగా మాటల మాంత్రికుడికి షరతు విధించారు.

trivikram 3

షరతు ప్రకారం సౌజన్య గారిని పెళ్లి చేసుకున్న త్రివిక్రమ్ గారికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. త్రివిక్రమ్ గారి భార్య గానే కాకా సౌజన్య గారు మంచి నృత్యా కళాకారిణిగా కూడా స్వతహాగా గుర్తింపు పొందారు. అలా మాటల మాంత్రికుడు పాటల మాంత్రికుడికి అల్లుడయ్యాడన్నమాట. త్రివిక్రమ్-సౌజన్యల వివాహంతో సిరివెన్నెల కు త్రివిక్రమ్ కు మధ్య మామ-అల్లుళ్ళ బంధం ఏర్పడింది.


End of Article

You may also like