Ads
మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రేక్షకులకి ఉన్న అభిమానం, క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల పాత్రలు పోషించగల నటుల్లో ఒకరు చిరంజీవి. ఎలాంటి పాత్ర అయినా సరే చిరంజీవి చాలా సులభంగా చేస్తారు. చిరంజీవిని కొత్త పాత్రల్లో చూడాలి అని జనం ఎప్పుడూ ఆరాటపడుతుంటారు. కొత్త కొత్త కథలని చిరంజీవి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలి అని అనుకుంటారు.
Video Advertisement
చిరంజీవి నటించిన సినిమాల్లో ఫేమస్ అయిన డైలాగ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. అలా చిరంజీవి నటించిన సినిమాల్లో కొన్ని ఫేమస్ డైలాగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో… రఫ్ ఆడించేస్తా..!
#2 వీర శంకర్ రెడ్డి.! మొక్కే కదా అని పీకేస్తే… పీక కోస్తా..!
#3 ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా… నచ్చితేనే చూస్తా… కానీ బలవంతం చేస్తే కోస్తా..!
#4 తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలవంచుకెళుతున్నాను… లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకొని వెళ్ళేవాడిని..!
#5 తెలుగుభాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం… క్షమించడం..!
#6 ఏదీ… ఒక్కసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో..!
#7 జస్ట్ టైం గ్యాప్ అంతే… టైమింగ్ లో గ్యాప్ ఉండదు..!
#8 రాననుకున్నారా… రాలేననుకున్నారా..?
#9 సింహాసనం మీద కూర్చునే అర్హత… అక్కడ ఆ ఇంద్రుడిది… ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది..!
#10 రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా… రోగితో సమానం..!
#11 బాక్స్ బద్దలైపోద్ది..!
#12 ఈ భూమి మీద పుట్టింది మేము… ఈ మట్టిలో కలిసి మేము… నీకెందుకు కట్టాలిరా శిస్తు..?
#13 ఈ లోకంలో ప్రతి వాడి లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు… ఒకొక్క మనిషికి ఒకొక్క లక్ష్యం ఉంటుంది..!
#14 జంక్షన్ జామ్ అయిపోద్ది..!
#15 సింహంతో వేట… నాతో ఆట మొదలుపెట్టకూడదు… ఒకసారి మొదలుపెట్టాక ఆపడం ఎవరి వల్లా కాదు..!
ఇవి మాత్రమే కాకుండా ఇంకా చిరంజీవి నటించిన సినిమాల్లో చాలా ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి. వాటిని ఇప్పటికే కాదు ఎప్పటికీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు.
End of Article