పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా తిప్పలు పడుతుంటారు. పంట పండే దాకా ఒక ఇబ్బంది, పండించాక ఒక ఇబ్బంది. ఓ వైపు పంట ను కాపాడుకోవాలి. మరో వైపు దిష్టి కన్ను తగలకుండా చూసుకోవాలి. ఈ బాధ పడలేక, ఓ రైతు ఓ పని చేసాడు. ఎన్ని సార్లు పంట పండించినా, చేతికి రాకపోవడం, దిగుబడి ఉండకపోవడం తో తన పంట కి నర దృష్టి తగులుతోంది అని ఆ రైతు భావిస్తున్నాడు.

tamanna, kajal flexis

దీనితో, ఆ రైతు ఒక పధకం ఆలోచించాడు. అతని ఆలోచనకి అందరు ఫస్ట్ షాక్ అయ్యి, ఆ తరువాత నవ్వుకుంటున్నారు. వివరాల్లోకెళితే, సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండ‌లం లో చందలపూర్ గ్రామం లో చంద్రమౌళి రెండు ఎకరాలలో మిర్చి పంట ను సాగు చేస్తున్నాడు. ప్రతి సారి పంట పండించడం, ఎదో ఒక తెగులు సోకి పంట నష్టపోవడం జరుగుతూ వస్తోంది. రెండు, మూడేళ్ళ పాటు పంట ఇలాగే నష్టపోతూ వచ్చాడు. దీనితో, తన పంటకి నరదిష్ఠి తగలడం వల్లే పంట నష్టపోయానని అనుకున్నాడు.

kajal flexi in crop

దిష్టిబొమ్మలు పెట్టుకున్నా, పరిస్థితి మారకపోవడం తో.. తమన్నా, కాజల్ ఫ్లెక్సి లను తీసుకుని పంటలో పెట్టాడు. ఆ హీరోయిన్స్ ఫోటోలు చాలా అందం గా ఉన్నాయి. ఆ దారిన పోయే వారంతా.. ఆ ఫోటోలని చూస్తూ వెళ్తున్నారు.. ఆ తోటని ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ ఫోటోలను చూసి వెళ్లిపోతున్నారు. తాజాగా, పంట గతం లో కంటే అధికం గా దిగుబడి రావడం తో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తమన్నా, కాజల్ లు తన పంటలోకి వచ్చాక లాభాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నాడు.  ఈ ఐడియా ను చూసినవారంతా ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది మాత్రం నవ్వుకుని వెళ్లిపోతున్నారు. ఏది ఏమైనా.. ఈ రైతు ఐడీయా అదిరింది కదా..