Ads
పూర్వ కాలం నుండి మనుషులు గుంపులుగా వేరు వేరు తెగలుగా నివసించడం మొదలుపెట్టినప్పటి నుండి కుక్కలు వారి కుటుంబ సభ్యులుగా భావించడం ఆ కాలం నుండే మొదలు అయ్యింది ..పూర్వ కాలం మానవులు అడవులలో జీవించేటప్పుడు రాత్రి సమయంలో నిదురించేటప్పుడు క్రూర మృగాలు వారి మీద దాడిచేయకుండా కుక్కలు అరిసి పడుకున్న మనుషులను మేలుకొలిపి ఆ క్రూర మృగాలను తరిమివెయ్యడానికి ఉపయోగపడేవి.ఈ విధంగా కుక్కలు మానవ జీవనంలో ఒక భాగం అయ్యాయి ..
Video Advertisement
ఆ తర్వాత నాగరికత పెరిగాక కూడా కుక్కలు చూపించే విశ్వాసం వలన అవి మనపట్ల చూపించే ప్రేమ వలన కుక్కలను పెంచుకుంటారు .కుక్క కి ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదు అని సామెత కూడా ఉంది ..అస్తమాను ప్రతిఇంట్లో ఈ విషయం గురించి చెప్పుకుంటూ ఉంటారు ..అలాగే మిగతా జంతువులూ ఐన పిల్లి ,లేడి ,గుర్రం ,ఎద్దులు ,ఆవులు ఇలా అన్ని జీవులతోను మనిషికి సంబంధం ఏర్పడింది ..మరి ముఖ్యంగా ఎద్దులు అయితే రైతుల జీవితంలో కీలక పాత్ర వహిస్తాయి ..ఎందుకంటే భూమిని దున్ని పంట పండించే సమయంలో ,ఒక చోట నుండి గడ్డిని మరియు ఇతర పదర్ధాల రవాణాలోనూ ఇవి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఇలా ఎద్దులు కూడా మనుషుల మీద బాగా ప్రేమను పెంచుంటాయి ..ఇలా ఒక ఎద్దు చూపించిన ప్రేమ అందరిని కంట తడి పెట్టించేలా చేస్తుంది ..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
ఉత్తరప్రదేశ్ లో ఒక రైతు ఒక ఎద్దును చిన్ననాటి నుండి పెంచుకొని తనతోనే ఉంచుకుంటున్నాడు .అది పెద్దగా అయినా తర్వాత రోజు పొలానికి తీసుకువెళ్లి మళ్ళీ ఇంటికి తనతో పట్టు తీసుకువచ్చేవాడు ..ఆ రైతుకు ఆ ఎద్దు అంటే చాలా ప్రేమ .కావున ఆ ఎద్దుకు భీమ్ అని పేరు పెట్టుకున్నాడు ..ఆ ఎద్దును కొంతకాలంగా ఇంటి దగ్గరే కట్టేసేవారు .అప్పుడు అది తీవ్రంగా అరుస్తూ రైతు గురించి రోదించేది..ఆ సమయంలో రైతు ఆరోగ్యం బాగోలేక ఇంటి దగ్గర ఉండేవాడు కాదు.తర్వాతా రైతు మరణించడంతో అంత్యక్రియల సమయంలో ఆ ఎద్దును స్మశాన వాటికి తీసుకువెళ్లారు.ఆ విషయం గ్రహించిన ఎద్దు తీవ్రంగా రోదించింది ..
అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత కూడా భీమ్ ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోయింది .ఎన్నిసార్లు బ్రతిమాలిన లాభం లేకపోయింది ..బలవంతంగా తీసుకువెల్దంమని ప్రయత్నించినా నిరాకరించింది.ఆ రైతు సమాధి దగ్గరకి ఎవరు వచ్చిన ఇతర జంతువులూ ఏమైనా వచ్చిన వాటిని అక్కడ నుండి తరిమేసేది.అక్కడే ఉంటూ గడ్డి తింటూ ఆ సమాధి ని చూస్తూ ఉండిపోయింది భీమ్.ఆ ఎద్దు ప్రేమను చుసిన స్థానికులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ..మనుషుల కంటే కూడా ఈ జంతువూ ఇంత ప్రేమ చూపిస్తుంది అని అందరు ఆ ఎద్దును గురించి అందరు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు ..
End of Article