నాన్న ఇంటికి రావద్దు అంటూ తండ్రికి కూతురు లేఖ…చిన్నారి ముందుచూపుకి హ్యాట్సాఫ్..!

నాన్న ఇంటికి రావద్దు అంటూ తండ్రికి కూతురు లేఖ…చిన్నారి ముందుచూపుకి హ్యాట్సాఫ్..!

by Anudeep

Ads

కరోనాపై గెలవాలంటే ఒక్కటే మార్గం సోషల్ డిస్టెన్సింగ్ . మనుషుల మధ్య సామాజిక దూరం ఉండాలనే నేపద్యంలో విధించిన కర్ఫ్యూ మూలంగా ఎక్కడి వాళ్లక్కడ ఆగిపోయారు . వాళ్లల్లో పొరుగూర్లలో ఉంటున్న కుటుంబ సభ్యులు ఉన్నారు . మన వాళ్లందరం ఒక దగ్గర ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటాం నిజమే . కాని ప్రస్తుతం అందరం ఒక దగ్గర ఉండడం కంటే ఎక్కడ చిక్కుకుపోయిన వాళ్లు అక్కడే ఉండిపోవడం చాలా ఉత్తమం.అలాంటి సందేశాన్నిచ్చే ఒక వీడియోని ప్రధాని నరేంద్రమోడీ తన ట్విటర్లో పోస్టు చేశారు.

Video Advertisement

ఆ వీడియోలో ఒక చిన్నారి తన తండ్రికి లేఖ రాస్తుంటుంది, ఆ లేఖ సారాంశం ఏంటంటే “నాన్న, మిమ్మల్ని నేను అస్సలు మిస్ కావడం లేదు . అమ్మ కూడా మిస్ కావట్లేదు . మీరు ఇప్పటికిప్పుడు ముంబయ్ నుండి ఇంటికి వచ్చేయాల్సిన అవసరం అస్సలు లేదు.. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. మీరు బయటికి వస్తే కరోనా గెలుస్తుంది . మనం అందరం కరోనాను ఓడించాలి నాన్నా”

పిల్లలకు అమ్మానాన్నే సర్వస్వం , వాళ్లు పక్కన ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా సులువుగా ఎదుర్కొంటామనే ధైర్యం . అయినా కూడా తండ్రిని రావొద్దని చిన్నారే స్వయంగా చెప్తుంది. అలాంటి చిన్నారులను తలచుకుంటే మనసు తరుక్కుపోతుంది. అయినా కూడా గుండె నిబ్బరం చేసుకుని ఉండాల్సిందే .కేవలం ఆ పాప వాళ్ల నాన్నే కాదు మనం అందరం కరోనాని ఓడించాలి , దానికోసం సోషల్ డిస్టెన్సింగ్ పాటించి తీరాలి . ప్రస్తుతం స్టేజ్ 2 లో ఉన్న కరోనా స్టేజ్ 3 లోకి ప్రవేశించకుండా ఉండాలంటే  మన వంతు బాద్యత మనం నిర్వర్తించి తీరాలి.

సామాజిక దూరంతో పాటు చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖాన్న తడిమే అలవాటు మానుకోవడం చేయాలి .మనతో పాటు మన చుట్టు పక్కల ఉన్నవాళ్లని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్నాళ్లు మనల్ని ఆ పని చేయ్ , ఈ పని చేయ్ అనేవాళ్లు, దేశం కోసం ఏం చేసావురా అని ప్రశ్నించేవారు . తిని తిరగడమేనా అని తిట్టేవాళ్లు కాని ఇప్పుడు ఏ పని చేయకపోయినా పర్లేదు బుద్దిగా ఇంట్లోనే ఉండూ అని అంటున్నారు.  కాబట్టి తీవ్రతని అర్దం చేస్కోండి . ప్రభుత్వాలకు సహకరించండి.


End of Article

You may also like