Ads
అంతరాత్మను మించిన గురువు ,అనుభవాన్ని మించిన పాఠం లేదు అని పెద్దలు చెప్తూ ఉంటారు.ఒకప్పుడు మనం చేసిన పనిని గుర్తుచేసుకుని అప్పుడు అలా చేసి ఉండకూడదు అని అనుకుంటాం.అంటే మనకు జీవిత పాఠాలు నేర్పేది ఎవరో కాదు మనం గతంలో చేసిన తప్పులే ఇప్పుడు మన గురువులు.మన తప్పుల నుండే కాకుండా ఇతరుల తప్పుల నుండి కూడా పాఠాలు నేర్చుకోవచ్చు .ఎందుకంటే మన తప్పుల నుండే మాత్రమే మనం పాఠాన్ని నేర్చుకోవాలంటే మనకున్న జీవితం సరిపోదు.ఒక తండ్రి తన కొడుకుకు ఒక సంఘటన ద్వారా ఈ గొప్ప పాఠాన్ని నేర్పుతాడు.నిజానికి ఇది ప్రతి వ్యక్తి తాను జీవితంలో తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం.ఆ గొప్ప తండ్రి తన కొడుకుకి ఏమిచెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం…
Video Advertisement
ప్రతీ తండ్రి కూడా తన కొడుకుకి ఏదో ఒక మంచి విషయాన్నీ చిన్నతనం నుండి చెప్తూ ఉండు.ఎందుకంటే తాను పడిన కష్టాలు కొడుకు పడుకూడదు అని ప్రతీ తండ్రి కోరుకుంటాడు కాబట్టి.అయితే ఒక తండ్రి చనిపోయే ముందు తన కొడుకుని పిలిచి ..ఇప్పుడు నా దగ్గర ఉన్న వాచ్ అతి పురాతనమైనది.దాదాపు 200 సంవత్సరాల క్రితం ది.మన పూర్వీకుల నుండి కూడా ఈ వాచ్ ఉపయోగిస్తూ వచ్చాము.ఇప్పుడు నువ్వు ఈ వాచ్ ను నగల దుకాణంలో అమ్మి డబ్బులు తీసుకురా.కానీ ఒక షరతు మొదటగా ఎంత డబ్బులు ఈ వాచ్ కి ఇస్తారో కనుక్కో… ఒకవేళ ఆ ధర సరైనది అయితే నేను నీకు అమ్మమని చెప్తాను అని కొడుకుకి చెప్పి పంపిస్తాడు ఆ తండ్రి .
అప్పుడు కొడుకు నగల దుకాణంలోకి వెళ్లి ఆ వాచ్ కు ఎంత ధర ఇస్తారో కనుక్కోగా చాలా పాత వస్తువు కాబట్టి 150 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేము అని చెప్తారు.అప్పుడు తన తండ్రికి ఈ విషయము గురించి తెలపగా ఈసారి పాన్ షాప్ దగ్గరకి వెళ్లి కనుక్కోమంటాడు.అప్పుడు ఈ వస్తువుకు 10 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేము ఎందుకంటే ఇది బాగా తుప్పు పట్టి ఉంది అని చెప్తారు.
ఈసారి తండ్రి కొడుకుతో మ్యూజియం దగ్గరకి వెళ్లి దీని ధర ఎంతో కనుక్కో అని పంపిస్తాడు.వాళ్ళు అది చూసి ఈ వాచ్ చాలా పురాతనమైనది మరియు అరుదైనది కాబట్టి దీనికి 5 లక్షల రూపాయలు ఇవ్వగలం అని చెప్తారు.దీనితో ఆశ్చర్యపోయిన కొడుకు తండ్రి దగ్గరకి వెళ్లి జరిగిన విషయాన్నంతా చెప్తాడు.అప్పుడు తండ్రి కొడుకుతో ..”ఈ ప్రపంచం చాలా విచిత్రమైనది” నీకు ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకు,అలా అని బాధపడి ఎదుటివారిని తప్పుగా అనుకోవాల్సిన పని లేదు, పైగా ఉపయోగం కూడా ఉండదు.కాబట్టి నీకు విలువ ఉన్న చోట మాత్రమే ఉండు అంతేగాని నీకు విలువ లేనిచోట ఉండకు అని ఆ తండ్రి తన కొడుకుతో చెప్తాడు .
ఒకరు మనకి విలువ ఇవ్వట్లేదు కాబట్టి మనకు విలువ లేదు అనికాదు అర్ధం.మన విలువ వేరేవారి దగ్గర ఎక్కువ ఉంటుంది అని అర్థంచేసుకోవాలి అని ఆ తండ్రి తన కొడుకుతో చెప్తాడు.ఈ కథను సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతివారికి కూడా విలువ ఉంటుంది కానీ ఎక్కడ విలువ ఉంటదని విషయాన్నీ మాత్రమే మనిషి తెలుసుకోవాల్సి ఉంటుంది అని మనకు అర్ధం అవుతుంది.
End of Article