కొడుకు భార్యనే పెళ్లి చేసుకున్నాడు..! వీరి కథ ఏంటంటే..?

కొడుకు భార్యనే పెళ్లి చేసుకున్నాడు..! వీరి కథ ఏంటంటే..?

by Anudeep

Ads

ఇప్పటి వరకు భర్తని కోల్పోయిన కోడలికి పెళ్లి చేసిన అత్తమామలను మనం చూసాం. కానీ ఇప్పుడు జరిగిన ఈ సంఘటనని మనం ఇప్పటి వరకు చూసి ఉండం. అతనికి భార్య లేదు. ఆమెకు భర్త లేడు. వాళ్లిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఒకరిని మరొకరు ఇష్టపడ్డారు. ఒంటరిగా జీవించడం కంటే కలిసి జీవితాన్ని పంచుకోవడం బెటర్ అనుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. కానీ వారిద్దరికీ మధ్య ఉన్న బంధం గురించి తెలిసిన అందరూ షాక్ అయ్యారు.

Video Advertisement

 

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో పెళ్లి చేసుకున్న వాళ్లిద్దరూ ఎవరో కాదు సొంత మామ, కోడలు. ఈ పెళ్లి వేడుకకు బంధు,మిత్రులు కూడా హాజరయ్యారు. ఛపియా ఉమ్రావ్‌ గ్రామానికి చెందిన 70సంవత్సరాల కైలాష్ యాదవ్ తన కోడలు పూజ అనే 28సంవత్సరాల మహిళను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి జరిగిన పెళ్లి వైరల్ గా మారింది. వారి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

father-in-law marries daughter-in-law in uttarpradesh..

70సంవత్సరాల వృద్ధుడు కైలాష్ యాదవ్ బదల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అతనికి నలుగురు సంతానం. 12ఏళ్ల క్రితం తన భార్య చనిపోయింది. తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తన మూడో కుమారుడు చనిపోయాడు. అతని భార్యే పూజ. కొడుకు చనిపోయిన తర్వాత కోడలు ఒంటరిగా ఉంటోంది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అంతే సమాజం ఏమనుకున్నా..తమ మధ్య సంబందాన్ని తప్పు పట్టినా లెక్క చేయకుండా గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం గుడిలో ప్రదక్షిణలు చేసి భార్యగా చేసుకున్న కోడలి నుదుటన తిలకం దిద్దాడు కైలాష్ యాదవ్.

father-in-law marries daughter-in-law in uttarpradesh..
42 ఏళ్ళ వ్యత్యాసం ఉన్నా ఇరువురి అంగీకారంతోనే ఈ పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది. పెళ్లి సమయంలో గ్రామస్తులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సమాజంతో సంబంధం లేకుండా వీరిద్దరి పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు, పూజ కూడా తన కొత్త సంబంధంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ వివాహం గురించి వైరల్ కావడం వల్లే తమకు తెలిసిందని స్టేషన్ ఇన్‌ఛార్జ్ బర్హల్‌గంజ్ చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు అని ఆయన తెలిపారు.


End of Article

You may also like