Ads
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 వ తారీఖున జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. నామినేషన్ గడువు ముగిసి ప్రస్తుతం ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారు అనేది ప్రకటించారు. ఈసారి ఎలాగైనా సరే హ్యాట్రిక్ విజయంతో అధికారంలోకి వస్తామని కెసిఆర్, కెసిఆర్ పదేళ్ల పాలనకు విముక్తి కల్పించి మేము అధికారంలోకి వస్తాము కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
Video Advertisement
అయితే ఎన్నికల్లో మహిళ అభ్యర్థులు కూడా ఎక్కువగా నిలబడ్డారు. మహిళా రిజర్వేషన్ ప్రకారం అన్ని ప్రధాన పార్టీలు మహిళలకు సీట్లు కేటాయించాయి. ఇప్పుడు ఎన్నికల బరిలో ఉన్న మహిళ అభ్యర్థులు ఎవరు?వారి ప్రత్యేకతలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
1.భోగా శ్రావణి:
ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 32 ఏళ్ల బోగ శ్రావణికి రాజకీయ నేపథ్యం ఉంది.బీఆర్ఎస్‌లో ఉంటూ జగిత్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు.బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వడంతో ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. డెంటిస్ట్ గా పని చేస్తున్నాను మొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడ్డారు.
2.సరిత తిరుపతయ్య:
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 40 ఏళ్ల సరిత తిరుపతయ్యకు ఇప్పటికే రాజకీయ అనుభవం ఉంది.మొన్నటి వరకు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె జోగులాంబ గద్వాల జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే గెలిచిన ఆమె అనూహ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అయ్యారు.అయితే జులైలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి టికెట్ సంపాదించి పోటీలో నిలిచారు.
3. యశస్విని రెడ్డి:
పాలకుర్తి శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న 26 ఏళ్ల మామిడాల యశస్విని రెడ్డికి రాజకీయ అనుభవం ఏమీ లేదు.ఆమె అత్త ఝాన్సీ రెడ్డి అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పేరు సంపాదించారు. ఈ ఎన్నికలలో ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఆమెకు భారత పౌరసత్వం రాకపోవడంతో టికెట్ దక్కలేదు.
4.లాస్య నందిత:
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పాలక బీఆర్ఎస్ పార్టీ 36 ఏళ్ల లాస్య నందితను పోటీలో నిలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉంటూ బీఆర్ఎస్ నేత సాయన్న మరణించడంతో ఆయన కుమార్తె లాస్య నందితకు పార్టీ అవకాశం ఇచ్చింది.లాస్య నందిత ఇంతకుముందు ఒకసారి జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా గెలిచారు. ఇంకో ప్రయత్నంలో ఓటమి పాలయ్యారు.
5.వెన్నెల:
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 43 ఏళ్ల జీవీ వెన్నెల పోటీ చేస్తున్నారు. ఇటీవల మరణించిన విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె ఈమె.విద్యాసంస్థను నడుపుతున్న ఈమెకు ప్రత్యక్ష రాజకీయాలలో అనుభవం లేదు. ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం కూడా ఇదే తొలిసారి.
6.బడే నాగ జ్యోతి:
ఎస్టీ నియోజకవర్గం ములుగులో బీఆర్ఎస్ పార్టీ 29 ఏళ్ల బడే నాగజ్యోతికి అవకాశం కల్పించింది. మావోయిస్టు నేత కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు ఎదురు నిలబడింది.2019లో ఆమె తొలిసారి సర్పంచిగా గెలిచి రాజకీయాలలో అడుగుపెట్టారు. అనంతరం తాడ్వాయి నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి ములుగు జిల్లాలో జడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. కొద్దినెలల కిందట ములుగు జడ్పీ చైర్మన్ మరణించడంతో నాగజ్యోతి ఇంచార్జ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
7.కోట నీలిమ:
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో తలపడుతున్నారు 52 ఏళ్ల కోట నీలిమ.కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నీలిమ చాలాకాలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పవన్ ఖేడా ఈమె భర్త. రాజనీతి శాస్త్రజ్ఞనంలో PhD చేశారు.
8. రాణి రుద్రమ రెడ్డి:
సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేస్తున్న 43 ఏళ్ల రాణి రుద్రమ గతంలోనూ ఎన్నికలలో పోటీ చేశారు.జర్నలిస్ట్‌గా పనిచేసిన ఆమె అనంతరం రాజకీయాలలోకి వచ్చారు. యువ తెలంగాణ అనే పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీలో చేరారు. ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌పై పోటీ చేస్తున్నారు.
9. చందుపట్ల కీర్తి రెడ్డి:
భూపాలపల్లిలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 42 ఏళ్ల చందుపట్ల కీర్తి రెడ్డి కుటుంబం సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంది.ఆమె మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలు.2018 ఎన్నికలలోనూ ఆమె బీజేపీ నుంచి భూపాలపల్లిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు.
End of Article