Ads
పుష్ప 1 ది రైస్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో పుష్ప 2 ది రూల్ కోసం అంత ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సుకుమార్ ఇంకా పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేయలేదు కానీ కథ గురించి రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి.
Video Advertisement
అందులో ప్రధానమైనది శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ట్విస్టు. రెండో భాగంలో ఆ పాత్రను చంపేస్తారని, దానికి ప్రతీకారంగా ప్రీ క్లైమాక్స్ నుంచి పుష్ప రాజ్ విశ్వరూపం ఉంటుందని ఇలా ఏదేదో స్టోరీలు అల్లేస్తున్నారు.
అదే నిజమానుకొని కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం, రకరకాల మీమ్స్ రావడం జరిగి పోయింది. ఇదిలా ఉంటే పుష్ప 2 ది రూల్ సినిమా ఎక్కువగా అడవిలో ఉంటుందిట. పైగా పులి సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంటుందిట.
నిజమైన పులితో షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చిత్ర యూనిట్ అందుకోసమే థాయ్లాండ్ వెళ్లి షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. థాయిలాండ్ వెళ్లి అక్కడ అడవిలో పులితో ఒక ఫైటింగ్ సీన్ తీస్తున్నట్టు టాక్. మరి ఆ పులి సీన్స్ లో బన్నీ ఉంటాడా లేదా అనే దానిపైన స్పష్టత లేదు.
పులి సీన్స్ ఒక పక్క తీస్తుంటే మరో పక్క అల్లు స్టూడియోలో సుకుమార్ బన్నీ సీన్స్ ని షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏమి రాలేదు. త్వరలో రావచ్చు అని అంటున్నారు. పైగా అల్లు స్టూడియోస్ షూటింగ్ చేసే ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. సుక్కు సార్ ఎక్కువగా హీరో, విలన్ క్లాష్ ని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఎలా నింపాలనే డిస్కస్ చేస్తున్నారట. అలానే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయట.
End of Article