Home Filmy Adda Pawan Kalyan: పవన్ కు షాకిచ్చిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్.. అసలేమైంది?

Pawan Kalyan: పవన్ కు షాకిచ్చిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్.. అసలేమైంది?

by Anudeep

నిన్న రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు అయ్యారు. ఆయన పలు అంశాలపై మాట్లాడారు. మూవీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించారు. ఈ స్పీచ్ తాలూకు వీడియో కొద్దీ సేపటికే చాలా వైరల్ అయింది. నెటిజన్స్ కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నప్పటికీ కొందరు నెగటివ్ గా కామెంట్స్ చేసారు. మరోవైపు టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఆయనకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.

pawan kalyan new

ఈ క్రమం లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పవన్ కళ్యాణ్ కు షాకిచ్చింది. తెలుగు సినీ పరిశ్రమ ఇరు ప్రభుత్వాల మద్దతు అవసారిమానాని పేర్కొంది. ప్రభుత్వం మద్దతు ఇవ్వకుంటే.. సినీ పరిశ్రమ నిర్వహణ కష్టతరమని పేర్కొంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ కష్టాలలో ఉందని, కొంతమంది మాత్రం వ్యక్తిగత అభిప్రాయాలను వేదికలపై చెబుతున్నారంటూ చురక వేసింది. మరో వైపు ఏపీ మంత్రులు సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న సంగతి గమనార్హం.

You may also like