Ads
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా ‘స్కంద’. ఈ మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 28న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అయితే మొదటి షోతో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ సినిమా పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి.
Video Advertisement
హీరో రామ్ పోతినేని ఈ మూవీలో రెండు పాత్రలలో నటించారు. మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటించింది. అయితే హీరోల పాత్రలకు మరియు హీరోయిన్ శ్రీలీల పాత్రకు పేరు మూవీలో వెల్లడించలేదు. దాంతో చాలామంది నెటిజెన్లు వారి పేర్లు ఏమిటా అని తెగ సెర్చ్ చేశారు. వారి పేర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
“అఖండ” బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన మరో మాస్ ఎంటర్ టైనర్ స్కంద. బోయపాటి శ్రీను మూవీ అంటే తప్పకుండా మాస్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. ఊహకు అందని రీతిలో బోయపాటి తన చిత్రాలలో ఫిక్షన్‌ను జోడిస్తారు. కానీ, స్కంద మూవీలో అది అతి అయ్యిందని ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.
రొటీన్ స్టోరీని కూడా విపరీతమైన వయొలెన్స్‌తో చూపించారని, మూవీలో పెద్దగా ఏమీ లేదని నెటిజెన్లతో పాటు విమర్శకులు కూడా అంటున్నారని టాక్. స్కంద మూవీలో హీరో రామ్ రెండు పాత్రలు చేసినట్టు తెలుస్తోంది. ఒక పాత్ర కాలేజీలో చదువుకునే యువకుడిగా నటిస్తే, మరో పాత్ర మొరాకోలో పేరుగాంచిన హంతకుడు. కాలేజీ స్టూడెంట్ గా నటించిన పాత్ర పేరు భాస్కర్ రాజు.
తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె శ్రీలీలా రెడ్డిని ప్రేమిస్తాడు. ఇక మొరాకో నుండి వచ్చిన రామ్ క్యారెక్టర్ పేరు మణికంఠ స్కందరాజు. శ్రీలీలా రెడ్డి క్యారెక్టర్ లో హీరోయిన్ శ్రీలీల నటించింది. ఈ మూవీ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 47 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
https://www.instagram.com/reel/Cx01_XvyCWd/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: “లియో” ట్రైలర్‌లో కనిపించిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? ఇతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..?
End of Article