Ads
2013లో విడుదలైన బిజినెస్ మాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ ని బిజినెస్ మాన్ కి ముందు, బిజినెస్ మాన్ కి తరువాత అని డివైడ్ చేసేటటువంటి సినిమా ఇది. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్,సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన రెండో సినిమా బిజినెస్ మాన్.ముంబై క్రైమ్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి మంచి ఊపునిచ్చింది.
Video Advertisement
ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన డైలాగ్స్,బాడీ లాంగ్వేజ్ సినిమాని ఓ రేంజ్ కి తీసుకువెళ్లాయి. దానికి పూరి స్టైల్ డైరెక్షన్ యాడ్ అవటంతో రికార్డులు సృష్టించింది ఈ సినిమా. అయితే ఈ సినిమా తెర వెనక కధ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ సినిమాకి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కానీ కథ పూరి జగన్నాథ్ ది కాదంట, కోర్ పాయింటు రామ్ గోపాల్ వర్మ ఇచ్చారంట.
రక్త చరిత్ర సినిమా చేస్తున్నప్పుడు ముంబైలో డాన్ ఎవరూ లేరని, ఒకవేళ కొత్త వ్యక్తి క్రైమ్ వరల్డ్ లో అడుగుపెడితే ఎలా ఉంటుంది అనే పాయింట్ డెవలప్ చేయమని శిష్యుడికి సలహా ఇచ్చాడంట రామ్ గోపాల్ వర్మ. కథ డెవలప్ అయిన తర్వాత ఈ సినిమా తమిళ్ నటుడు సూర్యకి అయితే బాగుంటుంది అనుకున్నాడంట రామ్ గోపాల్ వర్మ. కథని సూర్యకి వినిపిస్తే అతనికి కూడా బాగా నచ్చి ఓకే చెప్పేసాడు. కానీ అతనికి ఉన్న బిజీ షెడ్యూల్లో ఈ సినిమా చేయలేకపోయాడు.
అప్పుడు ఈ కథని మహేష్ దగ్గరికి తీసుకు వెళ్ళగా మహేష్ పూరి మీద ఉన్న గౌరవంతో కథ వినకుండానే ఓకే చెప్పేసాడంట. 74 రోజుల్లో షూటింగుని పూర్తిచేసుకుని 2013 సంక్రాంతి కానుకగా జనవరి 13 విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా సంగతి అందరికీ తెలిసిందే. 40 కోట్లతో సినిమాని తెరకెక్కిస్తే 90 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది బిజినెస్ మాన్.
End of Article