Ads
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పొన్నియిన్ సెల్వన్. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై ప్రేక్షాదరణ పొందుతోంది ఈ సినిమా. పొన్నియిన్ సెల్వన్ అనేది ఒక చారిత్రక నవల. దీన్ని కృష్ణమూర్తి (1899-1954) రాశారు. తన మ్యాగజీన్ ‘కల్కి’ కోసం 1950 నుంచి మూడేళ్ల పాటు ఈ నవలను ఒక సిరీస్ రూపంలో ప్రచురించారు.
Video Advertisement
చోళులలో ప్రసిద్ధుడైన రాజ రాజ చోళుడు-1 తండ్రి పరాంతక చోళుడు-2 ఆయన కాలంలోని కొన్ని చారిత్రక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కల్కి ఈ నవలను రాశారు. ఈ నవల కోసం చోళులు పాలించిన అనేక ప్రాంతాల్లో కల్కి పర్యటించారు. తంజావూరు, నాగపట్టణం, తిరువారూర్, అరియలూరుతో పాటు శ్రీలంకలో కూడా పర్యటించారు. ఈ నవల 2,400 పేజీలు ఉంటుంది. దీన్ని 5 భాగాలుగా రాశారు.
అయితే ఈ సినిమా కథ మణిరత్నం ఇప్పుడు అనుకున్నది కాదు. చాలా సంవత్సరాల నుండి మణిరత్నం ఈ సినిమా తీయాలి అని అనుకుంటున్నారు. 1990 లో ఒక సారి, 2011 లో కూడా ఈ సినిమా తీయాలనుకున్నారు మణిరత్నం. అందుకోసం అప్పుడు సినిమాలో నటించే వారిని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు నటిస్తున్న నటులు, అప్పుడు సినిమా కోసం అనుకున్న నటులు వీరు కాదు.
ఇప్పుడు మణిరత్నం అనుకున్న నటులెవరో ఇప్పుడు చూద్దాం..
#1 రేఖ
ఈ సినిమాలో కీలక పాత్ర అయిన నందిని కోసం.. 1990 లో రేఖని అనుకున్నారు మణిరత్నం.. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఐశ్వర్య రాయ్ ఈ పాత్ర లో నటించారు.
#2 విజయ్
ఈ మూవీ లో కార్తీ పోషించిన వండియా దేవన్ పాత్ర కోసం విజయ్ ని సంప్రదించారు కానీ ఈ చిత్రం ఆలస్యం అవుతుండటం తో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
#3 కీర్తి సురేష్
ఈ చిత్రం లో మరో కీలక పాత్ర కుందవై. ఈ పాత్రని త్రిష పోషించారు. కానీ ముందుగా ఈ పాత్ర కోసం కీర్తి సురేష్ ని అనుకున్నారు.
#4 మహేష్ బాబు
ఈ చిత్రం లో ఒక పాత్ర కోసం మహేష్ లుక్ టెస్ట్ కూడా జరగ్గా.. ఈ చిత్రం ఆలస్యం అవుతుండటం తో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
#5 అనుష్క
ఈ చిత్రం లో ఒక పాత్ర కోసం అనుష్క ని ఎంపిక చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
#6 సూర్య
తన తమ్ముడు ఈ చిత్రం లో నటించిన వండియా దేవన్ పాత్రకి కూడా ముందుగా సూర్య ఎంపికయ్యారు. కానీ వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ కావడం తో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
#7 అమలాపాల్
హీరోయిన్ అమలాపాల్ ని కూడా ఒక పాత్ర కి ఎంపిక చేసారు. కానీ ఈ చిత్రం ఆలస్యం అవుతుండటం తో ఈమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
Also read: పొన్నియన్ సెల్వన్ కోసం… మణిరత్నం అలాంటి నిర్ణయం తీసుకున్నారా..?
End of Article