Ads
నాయకుడు, ముంబై, రోజా వంటి క్లాసిక్ సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’ టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇందులో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.
Video Advertisement
టీజర్‌లో పోరాట సన్నివేశాలు, నటీనటుల నటన ఆకట్టుకుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు. ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1’ మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. సినిమాకు పొన్నియన్ సెల్వన్ పాత్ర కోసం మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుని అనుకున్నారంట. కానీ కొన్ని కారణాలతో మహేష్ దీన్ని వదులుకున్నట్టు సమాచారం.
అలాగే తలపతి విజయ్ ని కూడా ఒక పాత్ర కోసం అనుకున్నారంట. డేట్స్ కుదరక దీన్ని మిస్ చేసుకొని ఉండొచ్చు. పొన్నియన్ సెల్వన్ లో త్రిష పాత్ర కోసం మొదట కీర్తి సురేష్ ని అనుకున్నారంట. కానీ ఆ టైం లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో పెద్దన్న సినిమా చేస్తుండడంతో దీన్ని వదులుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మణిరత్నం నుంచి చాలా రోజులకు మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
End of Article