Ads
అల్లు అర్జున్ కి పుష్ప సినిమా మంచి హిట్ ని ఇచ్చింది. ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా. ఈ సినిమాలో ఎర్ర చందనం సీన్స్ బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. పైగా ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ కి ఎంతో మంది ఫిదా అయిపోయారు.
Video Advertisement
చాలా మంది సెలబ్రిటీలు అయితే అల్లు అర్జున్ ని ప్రశంసించారు కూడా. అయితే ఇది ఇలా ఉంటే పుష్ప కింద కేవలం ఒక హీరో మాత్రమే సెట్ అవ్వగలరు.
లీడ్ రోల్ కనుక జాగ్రత్తగా ఫైనల్ చెయ్యాలి. అది అల్లు అర్జున్ అని ప్రూవ్ చేసుకున్నారు. కానీ నిజానికి మొదట సుకుమార్ మహేష్ బాబు తో పుష్ప సినిమా తీయాలని అనుకున్నారు. కానీ ఆఖరికి మహేష్ బాబు సెట్ అవ్వడాన్ని అల్లు అర్జున్ ని సుకుమార్ ఫైనల్ చేసారు. అదే విధంగా నటీ నటుల విషయంలో కూడా కొన్ని మొదట అనుకున్నారు. కానీ ఆఖరికి జాగ్రత్తగా మార్పులు చేశారు దర్శకుడు సుకుమార్. పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షేఖావత్ పాత్ర బాగా ఆకట్టుకుంది. అయితే ఆ పాత్ర కోసం కూడా సుకుమార్ కొంత మందిని ముందు కలిశారు. అలాగే కొంత మందితో ఆ పాత్ర చేస్తే బాగుంటుందని అనుకున్నారు. మరి ఆ నటుల గురించి కూడా చూద్దాం.
#1 విక్రమ్
ఈ పాత్ర కోసం మొదట హీరో విక్రమ్ ని అనుకున్నారట. కానీ విక్రమ్ ఈ పాత్ర కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు.
#2 విజయ్ సేతుపతి
ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషిస్తున్నట్లు ముందు ప్రకటించారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల విజయ్ సేతుపతి ఈ సినిమాను నుండి తప్పుకున్నారు.
#3 జిష్షు సేన్‌గుప్తా
ప్రముఖ బెంగాలీ నటుడు జిష్షు సేన్‌గుప్తాని కూడా ఈ పాత్రకి అనుకున్నట్టు సమాచారం.
#4 మాధవన్
పుష్ప సినిమాలో మాధవన్ విలన్ రోల్ చేస్తారు అని ఒక సమయంలో వార్త వినిపించింది. కానీ మాధవన్ ఈ పాత్ర చేయలేదు.
#5 ఆర్య
పుష్ప సినిమాలో విలన్ పాత్రకి ప్రముఖ తమిళ నటుడు ఆర్యని కూడా సంప్రదించినట్టు సమాచారం.
#6 బాబీ సింహ
ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహం కూడా పుష్ప సినిమాలో విలన్ పాత్ర కోసం అనుకున్నారట.
ఇలా పుష్ప సినిమాలో విలన్ పాత్ర కోసం వీరందరిని అనుకున్న తర్వాత మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఆ పాత్ర చేశారు.
End of Article