Ads
నిన్న మొన్న బిగ్ బాస్ షో సీజన్ 6 ప్రారంభమైనట్లు అనిపిస్తున్న అప్పుడే దాంట్లో నామినేషన్ల హడావిడి, ఎలిమినేషన్ల జోరు స్టార్ట్ అయిపోయింది. మామూలుగా ఇంతవరకు ప్రతి సీజన్లో హౌస్ లోకి వెళ్లిన నెక్స్ట్ డే నామినేషన్ పంచాయతీ ఉండేది కానీ ఈసారి మాత్రం తమాషాగా రెండు రోజులు గేమ్ ఆడనిచ్చి తరువాత బుధవారం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు.
Video Advertisement
ఇప్పుడు ఈ వారం ఎలిమినేషన్ ఓటింగ్ విషయానికి వస్తే మొదటిసారి నామినేషన్ల బరిలో ఉన్న ఏడుగురు ఎవరో కాదు….ఇనయ సుల్తానా,అభినయ శ్రీ, జబర్దస్త్ ఫైమా, శ్రీ సత్య ,ఆరోహి, చలాకీ చంటి మరియు సింగర్ రేవంత్. శుక్రవారం అర్ధరాత్రి తో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. దాంతో ఈ ఏడుగురులో ఒకళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిన మొదటి వారంలోనే ఇంటి ముఖం పడతారు.
బిగ్ బాస్ లో పాల్గొన్న 21 మంది కంటెస్టెంట్స్ లో దండం పెట్టి మరీ నన్ను బయటకు పంపించేయండి అనే అంతగా టార్గెట్ అయిన ఏకైక వ్యక్తి సింగర్ రేవంత్ అని చెప్పుకోవచ్చు. కానీ రేవంత్ కి ఇండియన్ ఐడల్ వల్ల మంచి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది .పైగా అతను అంటే ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాలలో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అని అందరూ భావిస్తున్నారు. ఆన్లైన్ పొల్ లో ఇప్పటికే రేవంత్ 32 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నాడు.
ఇక తర్వాత స్థానంలో జబర్దస్త్ ఫైమా ఉన్నట్లు సమాచారం. బిగ్ బాస్ షోలో జబర్దస్త్ కామెడీ చేస్తూ తనకంటూ ఓ ఇమేజిని బిల్డప్ చేసుకోవడంలో ఫైమా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. తరువాత స్థానాల్లో శ్రీ సత్య ,చంటి,ఆరోహి ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ దృశ్యా ఈ ఐదుగురు ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కారనే భావించవచ్చు. కానీ పాపం ఇంక డేంజర్ జోన్ లో మిగిలింది ఇనయ సుల్తానా మరియు అభినయ శ్రీ.
ఈ ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం అనే విషయం తెలుస్తుంది. కానీ తన పని తాను చేసుకు పోయే అభినయశ్రీ తో పోలిస్తే కాస్త హుషారుగా ఉండే ఇనయ కు షో లో కొనసాగే ఛాన్స్ ఉండొచ్చు అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇనయకి 6 శాతం ఓట్లు వస్తుంటే.. అభినయకి 5 శాతం ఓట్లు వస్తున్నాయి. మరి అందరి అంచనా ప్రకారం వీరిద్దరిలో ఒక ఎలిమినేట్ అవుతారా లేదు మొత్తం ఏడుగురిలో ఎవరో ఒకరు ఇంటికి వెళ్తారా అనేది శుక్రవారం ఎపిసోడ్ లో తేలాల్సి ఉంది
End of Article