Ads
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి విషయం వెలుగులోకి వస్తోంది. ప్రతి వ్యక్తి తనకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే విషయం మన దేశ యువరాజు గురించి.
Video Advertisement
ఆ యువరాజు పేరు మన్వేంద్ర సింగ్ గోహిల్. ఈయన రఘువీర్ సింగ్ రాజేంద్ర సింగ్, రాజ్ పిప్లా రాచరిక మాజీ రాణి రుక్మిణిదేవి కుమారుడు. మన్వేంద్ర సింగ్ ప్రత్యేకత ఏంటంటే ఇతను మన దేశపు తొలి స్వలింగ సంపర్కుడుగా భారత ప్రభుత్వం నుంచి ఈ సర్టిఫికేటు అందుకున్న భారత యువ రాజు.
మన్వేంద్ర సింగ్ కి ఇంతకుముందే పెళ్లి అయింది. వివాహ జీవితం ఆనందంగా లేకపోవడంతో భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత తను చేసిన తప్పుకి పశ్చాత్తాప పడుతూ ఎమోషనల్ పోస్ట్ కూడా వ్యక్తం చేశారు. పన్నెండేళ్ల వయసులోనే మన్వేంద్ర స్వలింగసంపర్కుల గురించి మొదటిసారిగా తెలిసింది. 2006వ సంవత్సరంలో తొలిసారిగా తాను కూడా స్వలింగసంపర్కుల మన్వేంద్ర సింగ్ తెలియజేశారు. మన్వేంద్ర సింగ్ స్వలింగ సంపర్కుల హక్కుల కోసం చాలా కాలం పోరాటం చేశారు.
2018లో సుప్రీంకోర్టు సెక్షన్ 377 ను తొలగించి స్వలింగ సంపర్క సంబంధాలు నేరం కాదని స్పష్టం చేసింది. లింగ సంపర్కుడు అయిన మన్వేంద్ర సింగ్ భార్యతో విడాకులు తీసుకున్నాక గత ఎనిమిది సంవత్సరాలుగా తన స్నేహితుడైన డిఆండ్రితో మన్వేంద్ర సహజీవనం చేస్తున్నారు. ఇటీవల మన్వేంద్ర సింగ్ గోహిల్ తన గే స్నేహితుడైన డిఆండ్రి రిచర్డ్ సన్ ని వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన మ్యారేజ్ సర్టిఫికేట్ ను పోస్ట్ చేస్తూ తెలియజేశారు. ఇది కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
End of Article