మనిషి ముఖం తో ఉన్న సొరచేప..సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఫోటోలు..!

మనిషి ముఖం తో ఉన్న సొరచేప..సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఫోటోలు..!

by Anudeep

Ads

ఈ భూమి అనేక అద్భుతాలు ఉన్నాయి. ప్రతి సృష్టి అద్భుతమే. అయితే, కొన్ని సార్లు కొన్ని వింతలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. మనిషి ముఖాన్ని పోలిన ఓ సొరచేపను ఓ మత్స్యకారుడు పట్టుకున్నాడు. ఇటీవల, ఇండోనేషియా కు చెందిన ఓ మత్శ్యకారుడు వేటకు వెళ్ళాడు. అయితే, అతని అదృష్టం కొద్దీ ఆరోజు ఓ భారీ సొరచేప అతని వలకి చిక్కింది.

Video Advertisement

fisherman

అతను ఆ సొరచాపను బయటకు లాగి దానిని కోసి చూడగా, లోపల మరో సొరచేప కనిపించిందట. అది చాలా చిన్న గా ఉండి. అంతే కాదు అది చూడడానికి మనిషి ముఖాన్ని పోలి ఉన్నాయి. దానికి మానవ దంతాలలాగానే దంతాలు కూడా అమర్చబడి ఉన్నాయి. ఈ వింత చూడడానికి అక్కడి చుట్టుపక్కల జనాలు తండోపతండాలు గా వస్తున్నారట. అంతే కాదు, ఆ సొరచేపను అమ్మాలని కోరుతున్నారట. కానీ, అవి తనకు అదృష్టం తెచ్చిపెడతాయని ఆ మత్స్యకారుడు నమ్ముతున్నాడు. అందుకే వాటిని విక్రయించడానికి ఇష్టపడలేదు. అయితే, ఈ ఫోటో లు మాత్రం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.


End of Article

You may also like