చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది.

Video Advertisement

ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది.

చాణక్య నీతి ప్రకారం ఈ ఐదు లక్షణాలు ఉన్న స్త్రీలు మగవారి జీవితంలో ఉంటె వారు అదృష్టవంతులట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1. తన ధర్మాన్ని తాను ఆచరించే స్త్రీ ఉత్తమురాలట. అటువంటి స్త్రీ ఎవరి జీవితంలో ఉంటె వారి విధి మారుతుంది. సనాతన ధర్మాన్ని పాటిస్తూ.. ప్రతిరోజు పూజలు చేసుకునే స్త్రీ ఉండే ఇళ్లల్లో దేవుడు కొలువై ఉంటాడు. అటువంటి స్త్రీలు ఉన్న చోట ఎలాంటి సమస్యలు ఉండవట.

# 2. ఏ పరిస్థితిల్లో అయినా.. తన భావాలను నిగ్రహించుకుంటూ.. సంతృప్తి పొందే స్త్రీ తన మగవాడికి మద్దతు ఇస్తుంది. అటువంటి స్త్రీ తన మగవాడికి ఎటువంటి ఆపదలు వచ్చినా, కష్ట సుఖాల్లోనూ తోడు నిలుస్తుంది.

# 3. ఎన్ని కష్టనష్టాలు ఏర్పడ్డా సహనం తో ఉన్న స్త్రీ ని కలిగిన వ్యక్తి అదృష్టవంతుడే.

# 4. ఎట్టి పరిస్థితిలో అయినా తమాయించుకుని ప్రశాంతతని వ్యక్తపరిచే స్త్రీ కలిగి ఉండడం కూడా అదృష్టమే. శాంతి ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. ఇటువంటి ప్రశాంతత కలిగిన స్త్రీలు ఉన్న ఇంట్లో కూడా భగవంతుడు ఉంటాడు.

# 5. మధురంగా మాట్లాడే స్త్రీలు ఎవరిని వరిస్తే వారి పంట పండినట్లే. ఎందుకంటే వీరు ఎలాంటి పరిస్థితిలో అయినా తమ భర్తని బాధపెట్టకుండా చూసుకుంటారు.