Ads
ఆయన ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రైతు. ఆయన పేరు శ్రీ సహదేవ్ సహరన్. ఆయనకు పెళ్లి అయిన తరువాత ఐదుగురూ ఆడపిల్లలే పుట్టారు. వారి పేర్లు రోమా, మంజు, అన్షు, రీతు, సుమన్. ఆ రైతు కొడుకులు లేరే అని బాధపడలేదు. ఆ కూతుర్లనే కొడుకులతో సమానంగా చూసుకున్నాడు. వారికి మంచి చదువులను చెప్పించాడు.
Video Advertisement
ఆయనకు “ఐఏఎస్” కావాలన్న కోరిక ఉండేది. కానీ, నెరవేర్చుకోలేకపోయాడు. ఇదే విషయాన్నీ ఆయన తన కూతుర్లకు వివరించాడు. మీలో ఒకరైన తన కలని నెరవేర్చాలని కోరాడు.
ఆ ఐదుగురు కూతుళ్లు నిజంగా బంగారాలే. తండ్రి మాటను పట్టుకుని సరస్వతి బిడ్డలయ్యారు. ఐదుగురు చదువుల్లో రాణించారు. ఒక ఇంటి నుంచి ఒక వ్యక్తి కలెక్టర్ గా ఎంపిక అవ్వడమే గొప్ప విషయం. కానీ, వీరి ఇంటినుంచి ఐదుగురు అక్క చెల్లెళ్ళు కలెక్టర్లు అయ్యారు. తండ్రి సహారన్ పాటు ఆ ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
రాజస్థాన్ హనుమాఘర్ కు చెందిన వీరి కుటుంబం గురించి యావత్ దేశం మాట్లాడుకుంటోంది. 2018 వ సంవత్సరంలో నిర్వహించిన రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తాలూకు పరీక్షా ఫలితాలను ఇటీవలే విడుదల చేసారు. ఈ ఫలితాలలో అన్షు, రీతు, సుమన్ ముగ్గురు ఆర్‌ఏఎస్ కు ఎంపిక అయ్యారు. ముగ్గురు ఒకేసారి ఎంపిక అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇప్పటికే వారి ఇంటి నుంచి రోమా, మంజులు కలెక్టర్లుగా ఎంపిక అయ్యి, సేవలు అందిస్తున్నారు. తాజాగా మరో ముగ్గురు చెల్లెళ్ళు కూడా ఒకేసారి ఆర్ఏఎస్ కు ఎంపిక అవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీరి గురించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కష్వాన్ ట్విట్టర్ లో స్పందించారు. దీనితో వీరి స్టోరీ ప్రపంచానికి తెలిసింది. ఒకే ఇంట్లో నుంచి ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఎంపిక అవడం విశేషమని.. వీరి వలన వీరి కుటుంబం పట్ల అందరికి మరింత గౌరవం పెరిగిందని ఆయన కామెంట్ చేసారు.
End of Article