టాప్ ప్రొడ్యూసర్ “దిల్ రాజు” కెరీర్‌లో… ఘోరంగా ఫ్లాప్ అయిన 12 సినిమాలు..!

టాప్ ప్రొడ్యూసర్ “దిల్ రాజు” కెరీర్‌లో… ఘోరంగా ఫ్లాప్ అయిన 12 సినిమాలు..!

by Anudeep

Ads

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పట్టిందల్లా సూపర్ హిట్ మూవీ అవుతుందని ఇండస్ట్రీలో టాక్. అందుకు తగ్గట్టే దిల్ రాజు స్టోరీ సెలక్షన్ కూడా భిన్నంగా ఉంటుంది.

Video Advertisement

ముఖ్యంగా దిల్ రాజు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చిత్రాల్ని నిర్మిస్తూ అభ్యంతరకరమైన డైలాగులు కానీ, సీన్లకు గానీ దూరంగా ఉంటాడు. టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్లు, డబుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టిన రికార్డులు దిల్ రాజు సొంతం.

3 dil raju

అలాంటిది దిల్ రాజు నిర్మించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. అందులో కొన్ని సినిమాలు ఏంటంటే..

#1. మున్నా:

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో 2007 వచ్చిన మున్నా సినిమా దిల్ రాజు ఫ్లాప్ లిస్ట్ లో ఒకటి.

#2. జోష్:

అక్కినేని నాగ చైతన్య డెబ్యూ మూవీ జోష్ 2009లో వాసు వర్మ తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆశించిన ఫలితం దక్కలేదు.

#3. మరో చరిత్ర:

రవి యాదవ్ డైరెక్షన్ లో 2010 లో మరో చరిత్ర మూవీ వచ్చింది. ఇందులో వరుణ్ సందేశ్ హీరోగా నటించారు ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

#4. గగనం:

కింగ్ నాగార్జున హీరోగా రాధ మోహన్ దర్శకత్వంలో 2011లో గగనం మూవీని తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మించిన ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో ఇది కూడా ఒకటి.

#5. రామ రామ.. కృష్ణ కృష్ణ:

శ్రీవాస్ దర్శకత్వంలో, రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం రామ రామ.. కృష్ణ కృష్ణ. ఈ సినిమాకు కూడా ఆశించిన ఫలితం దక్కలేదు.

#6. ఓ మై ఫ్రెండ్:

సిద్దార్థ, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఓ మై ఫ్రెండ్ మూవీ థియేటర్ లో వసూళ్లు రాబట్టలేదు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.

#7. రామయ్యా వస్తావయ్యా:

హరీష్ శంకర్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా చిత్రం దిల్ రాజు ఫ్లాప్ లిస్ట్ లో చేరి నిరాశ పరిచింది.

#8. కృష్ణాష్టమి:

స్టార్ కమెడియన్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో 2016 లో వచ్చిన కృష్ణాష్టమి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.

#9. శ్రీనివాస కళ్యాణం:

సతీష్ వేగేశ్న డైరెక్టర్ గా నితిన్, రాశిఖన్నా హీరో హీరోయిన్లు గా 2018లో వచ్చిన శ్రీనివాస కల్యాణం దిల్ రాజుకి ఫ్లాప్ లిస్ట్ లో చేరింది.

#10. లవర్:

రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో 2018 లో వచ్చిన లవర్ మూవీ ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

#11. ఇద్దరి లోకం ఒకటే:

జీ ఆర్ కృష్ణ డైరెక్టర్ గా రాజ్ తరుణ్ , షాలిని పాండే హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ఇద్దరి లోకం ఒకటే. ఈ చిత్రం కలెక్షన్స్ తీవ్రంగా నిరాశపరిచాయి.

#12. రౌడీ బాయ్స్:

ఈ సంక్రాంతికి విడుదలైన రౌడీ బాయ్స్ ఆశించిన అంచనాలను అందుకోలేక పోయింది. శ్రీ హర్ష కొనుగంటి దీనికి డైరెక్టర్ కాగా ఆశీష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు.


End of Article

You may also like