Ads
ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలలో మరో హీరో నటించడం అనేది టాలీవుడ్ లో సాధారణం అని చెప్పవచ్చు. అయితే రిజెక్ట్ చేసిన మూవీ హిట్ అయితే ఆ హీరో ఎందుకు వదులుకున్నామా అని ఫిల్ అవుతుంటారు.
Video Advertisement
కానీ అదే సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా లేదా ప్లాప్ గా మిగిలితే మాత్రం వదులుకుని తమకు తాము మంచి చేసుకున్నామని ఫిల్ అవుతుంటారు. అయితే స్టార్ హీరోలు ప్లాప్ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. ఏజెంట్:
ఇటీవల రిలీజ్ అయిన అక్కినేని అఖిల్ చిత్రం ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ స్టోరీని సురేందర్ రెడ్డి ముందుగా ప్రభాస్ కి వినిపించారంట.ఆయన రిజెక్ట్ చేయడంతో అఖిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
2. రామారావు ఆన్ డ్యూటీ:
మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. రవితేజ లాస్ట్ 7 చిత్రాలలో బాగా నిరాశ పరిచిన చిత్రం ఇదే. ఈమూవీ దర్శకుడు శరత్ మండవ ఈ కథను ముందుగా హీరో నాగర్జునకు చెప్పారంట. దానికి ఆయన ఈ మూవీ నా కన్నా వేరే హీరోలు సెట్ అవుతుందేమో అన్నాడంట. రవితేజకు సెట్ అవుతుందని చెప్పడంతో శరత్ ఈ కథను రవితేజకు చెప్పడం ఆయన నటించడం జరిగింది. 3. వినయ విధేయ రామ:
రామ్ చరణ్ బోయపాటి కాంబోలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ కూడా నిరాశ పడ్డారు. ఈ మూవీ రిజల్ట్ తరువాత రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ లెటర్ కూడా రాశారు. అయితే ఈ చిత్రాన్ని బోయపాటి ముందుగా ఆగడు మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినిపించారంట. మహేష్ నో చెప్పడంతో బోయపాటి రామ్ చరణ్ తో ఈ మూవీని పూర్తి చేశారు.4. రభస :
కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా ప్లాప్ గా నిలిచింది. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ సినిమా ఎంపిక విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు. ఈ సినిమాకి ముందుగా సంతోష్ శ్రీనివాస్ హీరో రామ్ తో కందిరీగ 2 ప్రకటించాడు. రామ్ రిజెక్ట్ చేశాడో లేదో కానీ ఆ తరువాత రభస మూవీ వచ్చింది.
5. స్పైడర్:
సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించిన స్పైడర్ ప్లాప్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ముందుగా ఎన్టీఆర్ కి చెప్పారంట. స్టాలిన్ మూవీ టైం లో గోపీచంద్ మలినేని మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేవారంట. ఆ టైం లో గోపీచంద్ ఈ స్టోరీని ఎంటర్ కి చెప్పారంట. అప్పుడు ఎన్టీఆర్ తనకు సెట్ అవకపోవచ్చని, మహేష్ కి అయితే సెట్ అవుతుందని అన్నారంట. మురుగదాస్ డైరెక్ట్ చేస్తే ఒకే అని మహేష్ అనడంతో ఈ మూవీ మొదలైంది.
6. నోటా:
గీతగోవిందం సినిమా తరువాత రిలీజ్ అవడంతో ఈ చిత్రం పై ఆడియెన్స్ భారీగా అంచనాలను ఏర్పరుచుకున్నారు. కానీ ఇది ప్లాప్ గా నిలిచింది. ఆనంద్ శంకర్ ముందుగా అల్లు అర్జున్ కి వినిపించారు. దానికి ఆయన సీఎం, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తనకు సెట్ అవకపోవచ్చని అనడంతో విజయ్ దేవరకొండకు కథ వినిపించడం, ఆయనఆకు నచ్చి ఒకే చెప్పడం జరిగింది.7. శ్రీనివాస కళ్యాణం:
ముందుగా ఎన్టీఆర్ కు చెప్తే సమయం కావాలని, ఆ తరువాత సమాధానం ఇవ్వకపోవడంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ సతీష్ రామ్ చరణ్ అనుకున్నారు కానీ చివరికి యంగ్ హీరో నితిన్ కి కథ వినిపించారు. నితిన్ కు కథ నచ్చడంతో ఇందులో నటించారు. 8. మిస్టర్:
శ్రీనువైట్ల చిత్రాలు ఆగడు మూవీ నుండి వరుసగా నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి.వాటిలో మిస్టర్ ఒకటి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రాన్ని ముందుగా అల్లు అర్జున్ కి చెప్పారంట. అప్పటికే సన్ ఆఫ్ సత్యమూర్తి చితంలో నటించడంతో మరో క్లాస్ మూవీలో చేయడం ఇంటరెస్ట్ లేదని చెప్పారంట. దాంతో ఇందులో వరుణ్ తేజ్ నటించారు.
9. శాకుంతలం:
సీరియల్ అని పేరు తెచ్చుకున్న ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయితే ముందుగా ఈ చిత్రంలో అనుష్క శెట్టి అనుకున్నారు. కానీ ఆ తరువాత చివరికి సమంత నటించింది. ఈ మూవీ రిలీజ్ తరువాత అనేక విమర్శలు వచ్చాయి. దర్శకుడు గుణ శేఖర్ పై, సమంతను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
Also Read: ప్రముఖ నటుడు “శరత్ బాబు” కి సంతానం ఉన్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు..?
End of Article