Ads
తెలుగు తెరపై మంచి కాంబినేషన్ సెట్ అవుతుంది అంటే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే ఆ సినిమా క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. తెలుగు తెరపై ఇప్పటి వరకు చాలా మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని హిట్ అయ్యాయి. మరికొన్ని భారీ ఫ్లాపులు అయ్యాయి.
Video Advertisement
అలా తెలుగు తెరపై ఎన్నో అంచనాల నడుమ వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం…!
1.ఆచార్య:
రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన RRR మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఆచార్య మొదటి రోజు నుండి డిజాస్టర్ టాప్ ను సొంతం చేసుకుని దారుణమైన కలెక్షన్స్ సాధించింది.
2. శంకర్ దాదా జిందాబాద్:మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ కాంబినేషన్ లో, పవన్ కళ్యాణ్ అతిధి పాత్రలో వచ్చిన చిత్రం శంకర్ దాదా జిందాబాద్ మూవీ. ఈ సినిమా కూడా శంకర్ దాదా ఎంబిబిఎస్ లో హిట్ అవుతుందని అంచనా వేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
3. సుల్తాన్:
సూపర్ స్టార్ కృష్ణ రెబల్ స్టార్ కృష్ణంరాజు నందమూరి బాలకృష్ణ కలిసి నటించిన మూవీ సుల్తాన్. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయింది.
4. అశ్వమేధం:
శోభన్ బాబు నటసింహం నందమూరి బాలకృష్ణ కలయికలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తరికెక్కిన మూవీ అశ్వమేధం. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది.
5. రామకృష్ణులు:
నందమూరి తారకరామారావు అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా జగపతి వి రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రామకృష్ణులు. ఈ మూవీ హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నాల హేరా పేరి సినిమాను కాస్త మార్చి తరకెక్కించారు. ఈ మూవీ కూడా అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది.
6. యుద్ధం:
సూపర్ స్టార్ కృష్ణ రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోలుగా నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ యుద్ధం. ఈ సినిమాలో కృష్ణ కృష్ణంరాజు తండ్రి తనయులగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.
7. కృష్ణార్జునలు:
దర్శకరత్న దాసరి డైరెక్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు కలిసిన నటించిన మూవీ కృష్ణార్జునులు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది.
8.మహాసంగ్రామం:
సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కలిసి నటించిన భారీ మల్టిస్టారర్ మూవీ మహాసంగ్రామం. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది.
Also Read:“అర్జున్ రెడ్డి” వచ్చి 6 ఏళ్లయింది…కానీ క్లైమాక్స్ లో ఈ విషయం ఎప్పుడైనా గమనించారా?
End of Article