Ads
ప్రతిభ ఉన్న వ్యక్తి ఎలా అయినా పైకి రాగలడు అని అంటారు. అలా చాలా మంది సంగీత రంగంలో కూడా తమ గాత్రం ద్వారా పేరు తెచ్చుకుంటున్నారు. గత కొంత కాలం నుండి ఎంతో మంది సింగర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు, అవుతూనే ఉంటారు.
Video Advertisement
వారిలో కొంత మంది జానపద నేపథ్యం ఉన్న గాయకులు కూడా ఉన్నారు. తమన్, దేవి శ్రీ ప్రసాద్, రఘు కుంచె వంటి సంగీత దర్శకులు ఇలా ఫోక్ సింగర్స్ ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి, వారి ప్రతిభని నిరూపించుకోవడానికి ఒక అవకాశం కలిగేలా చేస్తున్నారు. తర్వాత వారు ఎన్నో పాటలు పాడి తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. అలా ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కొంత మంది ఫోక్ ఉన్న సింగర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 మంగ్లీ
మంగ్లీ పాడిన జానపద పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. తర్వాత మంగ్లీ చాలా సినిమాల్లో సూపర్ హిట్ పాటలు పాడారు.
#2 పెంచల్ దాస్
కృష్ణార్జున యుద్ధంలోని దారి చూడు పాట ద్వారా ఫేమస్ అయ్యారు పెంచల్ దాస్. తర్వత అరవింద సమేత వీర రాఘవ, చిత్రలహరి వంటి సినిమాల్లో పాడారు.
#3 బేబీ
బేబీ కూడా మట్టి మనిషిని నేను పాట ద్వారా గుర్తింపు పొందారు.
#4 మౌనిక యాదవ్
ఫోక్ సింగర్ మౌనిక యాదవ్ కూడా పుష్పలోని సామి సామి పాట ద్వారా ఇంకా గుర్తింపు పొందారు.
#5 మొగులయ్య
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ తో వెలుగులోకి వచ్చారు మొగులయ్య.
#6 కుమ్మరి దుర్గవ్వ
దుర్గవ్వ ఇటీవల భీమ్లా నాయక్ నుండి విడుదలైన అడవి తల్లి మాట పాట పాడారు.
#7 మధు ప్రియ
మధు ప్రియ పాడిన ఆడపిల్లనమ్మా పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సరిలేరు నీకెవ్వరూ తో పాటు ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్ పాటలు పాడారు.
#8 సూరన్న
అల వైకుంఠపురంలో సినిమాలో సిత్తరాల సిరపడు పాటని పాడారు సూరన్న.
#9 ఇంద్రావతి చౌహన్
పుష్పలోని ఊ అంటావా ఊ ఊ అంటావా పాటతో ఇంద్రావతి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇంద్రావతి కూడా జానపద నేపధ్యం నుండి వచ్చారు.
వీళ్ళు మాత్రమే కాకుండా జానపద నేపథ్యంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తర్వాత ప్లేబాక్ సింగర్స్ గా గుర్తింపు పొందిన సింగర్స్ ఎంతో మంది ఉన్నారు.
End of Article