Ads
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పార్టీ గుర్తు కారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు కారు డ్రైవింగ్ చాలా ఇష్టం. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ చేసే సమయంలో కేసీఆర్ హైదరాబాద్ నుండి డిల్లీ వరకు కార్ ర్యాలీ చేశారు.
Video Advertisement
ఆ ర్యాలీలో ముందువరుసలో కేసీఆర్ ఢిల్లీ వరకు తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తరువాత ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అప్పుడప్పుడు తన ఫామ్ హౌస్ లో కారును డ్రైవ్ చేసేవారట. గతంలో ఓ ప్రెస్ మీట్ లో ఎలక్ట్రిక్ కారును అప్పుడప్పుడు డ్రైవ్ చేసినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. తాజాగా కేసీఆర్ కొత్త కారులో ప్రయాణం చేయగా, ఆ వార్త వైరల్ గా మారింది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కాన్వాయ్‌లో ప్రయాణం చేసేవారు. అసెంబ్లీ ఎలెక్షన్స్ పరాజయం తర్వాత ఆయన కొత్త కారును కొనుగోలు చేశారు. అయితే ఆయన సరదాగా నడపడానికి కొత్త కారు తీసుకోలేదు. కొన్ని రోజులు కిందట కిందపడడంతో కేసీఆర్ తొంటి ఎముక విరగిన వశీహ్యం తెలిసిందే. కోలుకుంటున్న ఆయన ఫార్చునర్, ఇన్నోవా వంటి పెద్ద కార్లలో కాలు నొప్పి వల్ల ఎక్కడం, దిగడం ఆయనకు చాలా ఇబ్బందిగా మారింది.
ఈ ఇబ్బందులు వల్ల ప్రత్యామ్నయంగా కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. సీటింగ్ కిందకు ఉండే విధంగా ఉన్న సెడాన్ కార్ అయితే ఉత్తమం అని వారి ఫ్యామిలీ భావించింది. ఈ క్రమంలో కేసీఆర్ కోసం ప్రత్యేకంగా బెంజ్ కంపెనీకి చెందిన సెడాన్ కారుని కొనుగోలు చేశారు. కేసీఆర్ ఎక్కడానికి, దిగడానికి తేలికగా ఉండడం, సురక్షితంగా ఉండేందుకు ఈ కారును ఎంపిక చేశారు.
ఈ కారుకు కేసీఆర్ ఫేవరెట్ కలర్ తెలుపుతో పాటు, ఆయన లక్కీ నెంబర్ 6666 ను తీసుకునున్నారు. ఈ కారులో ఇంతకు ముందు మాదిరి సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణించే ఛాన్స్ లేదు. ఇందులో ఆయనతో పాటుగా వ్యక్తిగత సహాయకుడు మాత్రమే ఉంటారు. సెక్యూరిటీ సిబ్బంది కోసం ఇంకో వెహికిల్ ను ఏర్పాటు చేశారు. కాగా ఈ కొత్త కారు, బీఆర్ఎస్ సింబల్ కారు గుర్తును పోలి ఉంది. దాంతో ఈ విషయం చర్చగా మారింది.
Also Read: ఏపీ రాజకీయాలపై హీరో సుమన్ సంచలన కామెంట్స్..!
End of Article