ఈ బస్సుల్లో తిరగాలంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదా..? అది కూడా మన హైదరాబాద్ లోనే..?

ఈ బస్సుల్లో తిరగాలంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదా..? అది కూడా మన హైదరాబాద్ లోనే..?

by kavitha

Ads

గతంలో హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి. హైదరాబాద్ కి వచ్చినవారు చాలా ఆసక్తిగా వాటిని చూసేవారు. ఆ బాస్ లో ప్రయాణించి ఆనందించే వారు. కాలక్రమంలో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించకుండా పోయాయి.

Video Advertisement

అయితే డబుల్ డెక్కర్ బస్సులు ప్రస్తుతం హైదరాబాద్ లో తిరుగుతున్నాయి. అది కూడా ఉచితంగా ఈ బస్సులను తిప్పుతున్నారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. అందువల్ల ఈ బస్సులు ఏ రూట్లలో నడుస్తున్నాయో కూడా తెలియక ప్రజలు ఎక్కడం లేదు. మరి ఆ బస్సులు ఏ రూట్లలో నడుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..
ఒకప్పుడు నడిచిన డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకొస్తే బాగుంటుందని నెటిజన్లు కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా మినిస్టర్ కేటీఆర్ ని కోరారు. వారి రిక్వెస్ట్‌కు అంగీకరించిన మంత్రి కేటీఆర్  హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ తీసుకొస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ మాట ప్రకారం, డబుల్ డెక్కర్ బస్సులను ఇటీవల తీసుకొచ్చారు. 12 కోట్ల రూపాయలు వెచ్చించి,హెచ్‌ఎండీఏ సహకారంతో 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు.
‘జాయ్ రైడ్’ పేరుతో ఈ బస్సులను ఉచితంగా తిప్పుతున్నారు. ఫిబ్రవరి నుండి ఈ బస్సులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తున్నాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సులను పంజగుట్ట నుండి హైటెక్ సిటీ వరకు నడుస్తాయి. ఈ రూట్ లో మూడు బస్సులు ఉన్నట్టు తెలుస్తోంది. మరో బస్సు ట్యాంక్ బాండ్ రూట్ లో నడుస్తుందని,  ఇంకో బస్సు , సాలార్‌జంగ్‌ మ్యూజియం రూట్ లో తిరుగుతుందని సమాచారం.
ఆరవ బస్సు అబిడ్స్ రూట్ లో నడుస్తుందని తెలుస్తోంది. ఈ ఆరు బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చు. ఫ్రీ అని తెలియని చాలామంది ఈ బస్సుల రూపాన్ని చూసి, ఎంత టికెట్ ఉంటుందో అని, ఆ బస్సుల ఎప్పుడు వస్తాయో తెలియక కొంతమంది ఎక్కడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ బస్సుల్లో జర్నీ ఉచితం. టికెట్ అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చు.

Also Read: TSPSC గ్రూప్-1 పరీక్షలు రెండోసారి కూడా ఎందుకు రద్దు చేశారు..? కారణం ఏంటంటే..?


End of Article

You may also like