ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు దేశ ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ఆయన పలు కీలక ప్రకటనలను చేసారు. అన్ని వర్గాల ప్రజలకు వాక్సిన్ ను అందించే బాధ్యత కేంద్రానిదేనని ప్రధాని మోదీ స్పష్టం చేసారు. అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని వర్గాల ప్రజలకు కేంద్రం ఉచితం గా వాక్సిన్ ను అందిస్తుందని స్పష్టం చేసారు.

pm modi

ఏ రాష్ట్రము కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం రాదనీ ఆయన స్పష్టం చేసారు. ఈ నెల 21 నాటికి భారీ మొత్తం లో వాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని.. 18 ఏళ్ళు పైబడ్డ వారందరికీ కేంద్రమే ఉచితం గా వాక్సిన్ ను అందచేస్తుందని చెప్పారు. ఒకవేళ ఉచిత టీకా అవసరం లేదు అనుకునే వారు.. రూ.150 లతో ప్రైవేట్ టీకా వేయించుకోవచ్చన్నారు. వాక్సిన్లలో 25 శాతాన్ని ప్రైవేట్ రంగానికి అందుబాటులో ఉంచినట్లు మోదీ పేర్కొన్నారు.