ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క ప్రాణ స్నేహితుడు అయినా ఉండాలంటారు. రక్తసంబంధాలతో కూడా పంచుకోలేని సమస్యలని స్నేహితులతో పంచుకుంటూ ఉంటాం. ఏ రక్త సంబంధం లేకపోయినా మనకంటూ ఓ గుర్తింపునిస్తూ.. మనతో సన్నిహితంగా మెలిగే బంధమే స్నేహబంధం. అందులోని మాధుర్యం అచ్చంగా ప్రాణ స్నేహితులు ఉన్నవారికే తెలుస్తుంది.

Video Advertisement

అలాంటి స్నేహం ఎలా ఉంటుందో నిరూపించే ఘటన మ‌హబూబాబాద్ జిల్లా కేస‌ముద్రం మండ‌లం రాజీవ్ న‌గర్ తండా వద్ద చోటు చేసుకుంది. ఈ తండాకు చెందిన బాలాజీ అనే వ్యక్తి తన స్నేహితులతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు.

friends 1

టీవీ 9 కధనం ప్రకారం.. గత డిసెంబర్ 10 వ తేదీన అతను రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎంతో సరదాగా అందరితో కలిసిపోయే బాలాజీ హఠాత్తుగా మరణించడంతో అటు కుటుంబ సభ్యులు..ఇటు ప్రాణ స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అతన్ని మర్చిపోవడం ఎవరి వల్లా కాలేదు. ఈ క్రమంలో సోమవారం నాడు అతని పుట్టిన రోజు వచ్చింది. ఆరోజు తాము ఎంతగానో ప్రేమించే బాలాజీ ఇక లేడు అని మరింత బాధపడ్డారు. అతని పుట్టినరోజు వేడుక జరపాలనుకున్నారు.

friends 2

అతని సమాధి వద్దకే ప్రాణస్నేహితులు, కుటుంబ సభ్యులు వెళ్లారు. అందరు కలిసి అతని సమాధి వద్దే కేక్ ని కట్ చేశారు. అతనితో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. బయటకి వెళ్ళినప్పుడు అందరు కచ్చితంగా హెల్మెట్ ని ధరించాలని, మా స్నేహితుడికి జరిగినట్లు ఇంకెవ్వరికీ జరగకూడదు అని.. వారు చెబుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి లేకపోతే.. అతని సన్నిహితులు ఎంతలా బాధపడతారో కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే నెటిజన్స్ కి సైతం కన్నీళ్లొస్తున్నాయి.