Ads
పెళ్లిళ్లంటేనే సందడిగా ఉంటాయి. బంధువుల కోలాహలం, వధూవరుల స్నేహితుల అల్లరి కలగలిపి వేడుకగా చేస్తుంటారు. స్నేహితులు, కజిన్స్ వధూవరులను ఆటపట్టించడం అనేది చాలా పెళ్లిళ్లలో జరుగుతూనే ఉంటోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పెళ్ళిలో మాత్రం వరుడి స్నేహితులు హద్దు మీరారు.
Video Advertisement
వధూవరులకు మ్యాంగో జ్యూస్ ఇస్తున్నట్లు నటిస్తూ.. వెనకాల ఏకంగా మరో కథ నడిపించేసారు. ప్రస్తుతం ఈ ఫన్నీ సంఘటనకు చెందిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అల్లరి చేస్తున్నారు. మ్యాంగో జ్యూస్ లో కొంత జ్యూస్ ను తీసేసి.. అందులోనే సిరంజి సాయంతో కొంత మందుని మిక్స్ చేయడం మీరు వీడియో లో గమనించవచ్చు. అయితే ఇదంతా రికార్డు చేసారు.
ఆ తరువాత ఏమి తెలియనట్లు వధూవరుల చేత ఆ జ్యూస్ తీసుకెళ్లి తాగించారు. అయితే.. ఫ్రెండ్స్ చేసిన అల్లరి పని తెలియని వరుడు మాత్రం.. తన ఫ్రెండ్స్ జ్యూస్ తీసుకొచ్చినందుకు సంతోషపడి తాగేశాడు. కానీ.. టేస్ట్ అదోలా ఉండడంతో వింత ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
https://www.instagram.com/reel/Cb2AnidFyv_/?utm_source=ig_embed&ig_rid=b938511e-8f1e-46e4-aa07-abfb7f5f6deb
End of Article