Home Filmy Adda మళ్ళీ అరెస్ట్ అయిన ఫన్ బకెట్ భార్గవ్..! అసలెందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే..?

మళ్ళీ అరెస్ట్ అయిన ఫన్ బకెట్ భార్గవ్..! అసలెందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే..?

by Anudeep

గతం లో ఫన్ బకెట్ భార్గవ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనిపై పలు ఆరోపణలు రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు. మైనర్ బాలికను రేప్ చేసాడని.. అమ్మాయిలతో అసభ్యం గా ప్రవర్తించేవాడని.. ఇలా రకరకాలుగా ఆరోపణలు వచ్చాయి. వీటిల్లో వాస్తవం ఎంతో తెలియకపోయినా.. నెటిజన్లు ఫన్ బకెట్ భార్గవ్ ను తిట్టి పోశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయమై మాట్లాడడం తో.. అందరు నిజమనే నమ్మారు.

fun bucket bhargav

కొన్ని రోజులు జైల్లోనే ఉన్న ఫన్ బకెట్ భార్గవ్ ఆ తర్వాత బెయిల్ పై బయటకి వచ్చాడు. తాజాగా.. భార్గవ్ ని మళ్ళీ అరెస్ట్ చేశారట. బెయిల్ పై విడుదల అయ్యి బయటకి వచ్చినా భార్గవ్ తీరు మారకపోవడంతో అతన్ని మళ్ళీ అరెస్ట్ చేసారు. ఇటీవల భార్గవ్ సోషల్ మీడియా అకౌంట్స్ లో అనుచిత వ్యాఖ్యలతో పోస్ట్ చేసాడు.

bhargav 1

రేపు కేసు పెట్టినవారితో సహా.. భార్గవ్ పై ఆరోపణలు చేసిన బాధిత అమ్మాయిలను ఉద్దేశించి భార్గవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియా లో దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలు బాధితులను బెదిరించేలా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు అందడంతో భార్గవ్ ను అరెస్ట్ చేశామని దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ పేర్కొన్నారు.

bhargav 2

భార్గవ్ వాస్తవానికి బెయిల్ పై బయటకి వచ్చాడు. బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా భార్గవ్ బెదిరింపులకు పాల్పడడంతో అతడిని అరెస్ట్ చేసి పోక్సో కోర్ట్ లో ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలను పరిశీలించి, విచారణ చేసాక భార్గవ్ బెయిల్ ను రద్దు చేస్తున్నట్లు తీర్పునిచ్చారు. ప్రస్తుతం భార్గవ్ ను వైజాగ్ సెంట్రల్ జైలు కు తరలించినట్లు దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ పేర్కొన్నారు.

You may also like