“శ్రీదేవి డ్రామా కంపెనీ” లో ఈ తప్పు చూస్తే నవ్వాపుకోలేరు…చూసుకోవాలి కదా ఎడిటరు.?

“శ్రీదేవి డ్రామా కంపెనీ” లో ఈ తప్పు చూస్తే నవ్వాపుకోలేరు…చూసుకోవాలి కదా ఎడిటరు.?

by Anudeep

Ads

ప్రతి ఆదివారం ఈ టీవీలో మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మామూలుగా అయితే ఆదివారం పూట ఎక్కువగా సినిమాలు టెలికాస్ట్ చేస్తారు. కానీ ఈ టీవీ మాత్రం డిఫరెంట్ గా ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తుంది. అది కూడా మధ్యాహ్నం పూట ఈ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది.

Video Advertisement

ఈటివి ఎక్కువగా వినోదాత్మక ప్రోగ్రామ్స్ ను ప్రసారం చేస్తుంది. జబర్దస్త్ కామెడీ షో తో ప్రారంభమైన ఈ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీ దేవి డ్రామా కంపెనీ పేరుతొ మరో కామెడీ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

sridevi drama company 1

ఈ షో కి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంద్రజ ఈ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్ లో ఒక పొరపాటు చోటు చేసుకుంది.. ఆది టీం స్టేజి పైన పెర్ఫర్మ్ చేస్తూ ఉంది. ఈ టీం లో ఒక లేడీ వేషం వేసుకున్న ఆర్టిస్ట్ (జెంట్) కూడా ఉన్నారు.

sridevi drama company 2

అతను పెర్ఫార్మన్స్ లో భాగంగా భజన చేస్తూ స్టేజి పైనే ఉన్నారు. ఈ వీడియో లో అతను పెర్ఫర్మ్ చేస్తున్నట్లు చూపించారు. ఆ సీన్ లో ఆది పంచ్ వేస్తాడు. వెంటనే నెక్స్ట్ కట్ లో ఆ ఆర్టిస్ట్ ఆడియన్స్ లో కూర్చుని చప్పట్లు కొడుతున్నట్లు చూపిస్తున్నారు. ఒకవైపు పెర్ఫర్మ్ చేస్తూ.. తమ స్కిట్ కి తానే ఆడియన్స్ లో కూర్చుని చప్పట్లు కొట్టినట్లు ఉంది ఈ వీడియో. ఇది ఎడిటింగ్ లో జరిగిన మిస్టేక్ వల్ల ఇలా వచ్చింది. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూనే ఉంటాయి. అయితే.. ఈ వీడియో బిట్ ని కట్ చేసి సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

https://www.instagram.com/reel/CWI2WTVsW0l/?utm_medium=copy_link


End of Article

You may also like