సూపర్ మార్కెట్ లో ఫైర్ ఎక్సటింగిషర్ ని శానిటైజర్ అనుకోని ప్రెస్ చేసాడు…చివరికి? (వీడియో)

సూపర్ మార్కెట్ లో ఫైర్ ఎక్సటింగిషర్ ని శానిటైజర్ అనుకోని ప్రెస్ చేసాడు…చివరికి? (వీడియో)

by Anudeep

Ads

కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుండడంతో  మనుషుల్లో భయంతో పాటు, శుభ్రత పట్ల అవేర్నెస్ కూడా పెరిగింది. దీంతో శానిటైజర్లకి,మాస్కులకి డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా శానిటైజర్లు,మాస్కులకి పెరిగిన డిమాండ్తో రేట్లు కూడా అమాంతం పెంచేశారు. అంతేకాదు  శానిటైజర్ల కొరత ఏర్పడింది. దాంతో  షాపింగ్ మాల్స్, ఆఫీస్లలో శానిటైజర్లను ఏర్పాటు చేస్తే వాటిని వినియోగించుకుంటున్నారు. ఒక సూపర్ మార్కెట్ కి వెళ్లిన వ్యక్తి శానిటైజర్ అనుకుని దేన్ని ప్రెస్ చేశాడో తెలుసా?తర్వాత ఏమైందో తెలుసా?

Video Advertisement

చైనాలో వ్యాప్తి చెందిన కరోనా ధాటికి ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి . చైనా పక్కదేశాలైన పాకిస్తాన్, భారత్లో కూడా కరోనా కేసులు బయటపడుతుండడంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. పాకిస్తాన్లో ఇప్పటికి 33 కేసులు బయటపడగా, మన దేశంలో వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపద్యంలో రెండు దేశాలు పరిరక్షణ చర్యలు చేపడుతున్నాయి. అయితే  పాకిస్తాన్ లో ఒక వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరలయింది. అందరిని నవ్విస్తుంది. శానిటైజర్ అనుకుని ఫైర్ ఎక్సిటిన్గీజర్ ని ప్రెస్ చేశాడు ఆ వ్యక్తి.

పాకిస్తాన్ లోని గుజరంవాలా సూపర్ మార్కెట్లో ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ, ఫైర్ ఎక్స్టిన్గిజర్ (అగ్ని మాపక పరికరం) వద్దకు వెళ్లాడు. దానిని శానిటైజర్ మిషిన్ అనుకున్న ఆ వ్యక్తి, అక్కడికి వెళ్లాక చేయ్ చాచి,మరో చేత్తో దాన్ని ప్రెస్ చేశాడు. అంతే ఒక్కసారిగా దాని నుండి పొగ వెలువడింది.   కొద్ది సేపట్లోనే ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది.

క్షణకాలం పాటు ఏం జరిగిందో ఆ వ్యక్తికి అర్దం కాలేదు . ముందు షాక్ కి గురయ్యాడు. తర్వాత విషయం అర్దమై, ఏం జరగనట్టుగా మెల్లిగా అక్కడ నుండి జారుకున్నాడు.సూపర్ మార్కెట్ సిసిటివిలో రికార్డయిన ఈ వీడియో , ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది చూసిన మనోళ్లు అంతా మీ తెలివికి ఓ దండంరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో మీరు చూసి నవ్వుకోండి.

watch video:


End of Article

You may also like